ఫోన్‌లోనే పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎంత ఈజీ ప్రాసెసో తెలుసా.?
EPFO: ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యోగుల జీతంలో నుంచి ప్రతి నెల PF డబ్బు జమ అవుతుంది. చాలా మంది ఉద్యోగులు ఈ డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఫోన్‌లోనే పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

EPFO పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి
* PF డబ్బు తీసుకోవాలంటే ఫోన్‌లోనే EPFO మెంబర్ పోర్టల్‌కి వెళ్లాలి.
* ఇందుకోసం ముందుగా EPFO Member Sewa పోర్టల్‌లోకి వెళ్లాలి.
* అక్కడ UAN Number, Password ఎంటర్ చేయాలి.
* వెంటనే ఒక క్యాప్చా వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* ఒకవేళ UAN లేకుంటే మీ కంపెనీలోని HR డిపార్ట్‌మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు.
* ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోయినా "Forgot Password" ఆప్షన్ ద్వారా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ సర్వీస్‌లోకి వెళ్లాలి
అనంతరం ఆన్‌లైన్ సర్వీస్‌లోకి వెళ్లాలి. క్లైమ్ సెక్షన్‌లోకి వెళ్లాలి. లాగిన్ అయ్యాక హోమ్‌పేజ్‌లోనూ టాప్ మెను కనిపిస్తుంది. ఇందులో కనిపించే Online Services → Claim (Form-31, 19, 10C) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇందులో..
Form-31 → PF partial withdrawal (medical, education, marriage, house repair మొదలైనవి)
Form-19 → PF పూర్తి మొత్తం
Form-10C → Pension withdrawal
మీ అవసరానికి తగ్గట్టు సిస్టమ్ ఆటోమేటిక్‌గా సరైన ఫామ్ అందిస్తుంది.
ఆధార్, బ్యాంక్ వివరాలు సరిచూసుకోవాలి:
స్క్రీన్‌పై ఆధార్ నెంబర్, బ్యాంక్ కౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివరాలు సరి చూసుకోవాలి. వీటిలో ఏదైనా తప్పు ఉంటే క్లెయిమ్ పూర్తిగా ఆగిపోతుంది. అందుకే సమర్పించే ముందు ఇవి పూర్తిగా సరిగ్గా ఉన్నాయా అని చూసుకోవాలి. Aadhaar-PF లింక్ అయి ఉండాలి, Bank–PF లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింకింగ్ లేకుంటే.. కంపెనీ/HR ద్వారా లేదా EPFO ద్వారా అప్డేట్ చేయాలి.
విత్‌డ్రా ఫామ్ ఫిల్ చేయాలి:
తర్వాత Withdraw ఫారం వస్తుంది. ఇందులో ఎంత మొత్తం తీసుకోవాలని ఉంది, ఏ అవసరానికి తీసుకుంటున్నారు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఇంటి అడ్రస్‌తో పాటు పాన్ వివరాలు ఫిల్ చేయాలి. పీఎఫ్ మొత్తాన్ని మెడికల్ ఖర్చులు, ఇంటి రిపేర్స్, హౌస్ లోన్ చెల్లింపు, పిల్లల విద్య, పెళ్ళి ఖర్చులు, ఉద్యోగం వదిలేసినప్పుడు పూర్తి PF తీసుకోవచ్చు. EPFO ప్రతి కారణానికి వేరువేరు రూల్స్ అమలు చేస్తుంది.
3 రోజుల్లో ఖాతాలోకి డబ్బు
అన్ని వివరాలు ఎంటర్ చేసి ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే. మీ మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి Verify చేయాలి. ఆపై మీ క్లెయిమ్‌ను EPFO కార్యాలయానికి పంపిస్తారు. పూర్తి వివరాలు సరిగ్గా ఉంటే 3 వర్కింగ్ డేస్‌లో PF డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఆధార్ - యూఏఎన్, బ్యాంక్-యూఏఎన్ మిస్ మ్యాచ్ అయినా.. పాన్ వివరాలు లేకపోవడం, కంపెనీ కేవైసీ అప్రూవల్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి.

