- Home
- Business
- New Aadhaar App: కుటుంబం మొత్తం ఆధార్ ఒకే యాప్‌లో, వెంటనే కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
New Aadhaar App: కుటుంబం మొత్తం ఆధార్ ఒకే యాప్‌లో, వెంటనే కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
New Aadhaar App: ఆధార్ మనదేశంలో ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు మరిన్ని కొత్త సౌకర్యాలతో ఆధార్ యాప్ వచ్చింది. దీన్ని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

కొత్త ఆధార్ యాప్
ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి, ఆధార్ సంస్థ UIDAI తాజాగా ఒక కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు అందరూ ఉపయోగిస్తున్న m-Aadhaar యాప్‌కు భిన్నంగా, పూర్తిగా కొత్త ఫీచర్లతో ఈ యాప్ వచ్చింది. ఆధునిక డిజైన్, మెరుగైన భద్రత, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను ఒకేచోట నిర్వహించుకునే సౌకర్యం వంటి అనేక అంశాలతో ఈ యాప్ ను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల సంఖ్యలో ఆధార్ వినియోగదారులకు ఇది చాలా ఉపయోగపడనుంది.
ఒకే యాప్ లో కుటుంబ సభ్యుల ఆధార్
కొత్తగా విడుదల చేసిన ఈ యాప్ Android, iOS ప్లాట్‌ఫార్మ్‌లలో ఉచితంగా అందుబాటులో ఉంది. యాప్ ఓపెన్ చేసిన వెంటనే సులభంగా అర్థమయ్యే ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. ఎవరికైనా ఉపయోగించడానికి ఈ యాప్ చాలా తేలికగా ఉండేలా UIDAI తయారు చేసింది. ఈ యాప్‌లో ముఖ్యంగా వచ్చిన నూతన ఫీచర్ మల్టీ ప్రొఫైల్ సపోర్ట్. సాధారణంగా ఒక మొబైల్ నంబర్‌కు ఒక ఆధార్ మాత్రమే యాప్‌లో ఉండే వీలుండేది. కానీ కొత్త యాప్‌లో ఒకే ఫోన్‌లో 5 మంది వరకు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను జోడించుకోవచ్చు. అయితే ఒకే మొబైల్ నంబర్ ఆధార్‌లకు రిజిస్టర్డ్ అయి ఉండాలి. పిల్లల ఆధార్ కార్డులను లేదా తల్లిదండ్రులు కార్డులను సులభంగా నిర్వహించుకోవచ్చు.
భద్రతకు ప్రాధాన్యం
ఈ యాప్‌లో అత్యంత ముఖ్యమైన అంశం భద్రత. ఆధార్ డేటా విషయంలో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. UIDAI దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన బయోమెట్రిక్ లాక్ ఫీచర్‌ను అందిస్తోంది. యాప్‌లో ఆధార్ డేటాను చూడడానికి ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ గుర్తింపు తప్పనిసరి. అదే విధంగా యూజర్ అన్‌లాక్ చేయకపోతే, యాప్‌లో ఎవరూ ఏ సమాచారాన్ని చూడలేరు. అలాగే, యూజర్ డేటా ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో షేర్ అయిందో తెలుసుకోవడానికి ‘యాక్టివిటీ లాగ్స్’ అనే ప్రత్యేక ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఆధార్‌తో చేసిన ప్రతి చర్య యాప్‌లో రికార్డ్ అవుతుంది. ఇది వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.
QR కోడ్‌తో ధృవీకరణ
బ్యాంకులు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ట్రావెల్ బుకింగ్స్...ఇలా ఏ సేవైనా ఆధార్ వెరిఫికేషన్ కోరినప్పుడు ఇప్పుడు కొత్త యాప్‌లో QR కోడ్‌ను వెంటనే స్కాన్ చేయవచ్చు. యాప్ ఆఫ్‌లైన్ లో ఉన్నా QR కోడ్ పనిచేస్తుంది. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా సేవలను సులభంగా పొందడానికి తోడ్పడుతుంది.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి
కొత్త యాప్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో UIDAI Aadhaar App అని సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ నమోదు చేస్తే, మీ ముఖం (Face Authentication) ద్వారా లేదా ఇతర బయోమెట్రిక్ ద్వారా ధృవీకరణ కోరుతుంది. ఒకసారి ధృవీకరణ పూర్తయితే, ఆధార్ డిటైల్స్ ఆటోమేటిక్‌గా యాప్‌లో సేవ్ అవుతాయి. ఆ తర్వాత ఫోన్ కు నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మీరు వాటిని చూడవచ్చు. ఇతర కుటుంబ సభ్యుల ఆధార్ కార్డును జోడించాలంటే, హోమ్ స్క్రీన్‌లో మీ పేరుపై క్లిక్ చేసి "Add user" ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ వారి ఆధార్ నంబర్ నమోదు చేస్తే చాలు.

