Memory Loss: చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా? ఈ 7 చిట్కాలు ట్రై చేయండి!
Memory Loss: మీరు మీ బైక్ లేదా కారును ఎక్కడ పార్క్ చేశారో తరచుగా మర్చిపోతున్నారా? ఎవరి పేరైనా గుర్తుకు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారా? ఇప్పడు ఈ మర్చిపోయే సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది. అప్పుడప్పుడు మర్చిపోవడం సాధారణమే. కానీ పదే పదే మర్చిపోతుంటే మాత్రం ఈ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.

1. ఇతరులతో సమయం గడపండి
మనిషి సంఘ జీవి. అంటే ఒంటరిగా బతకలేడు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవించాలి. కాని ప్రస్తుత రోజుల్లో అలా లేదు. ఎవడి గోల వాడిది అన్నట్లు ఉంది. అందుకే జ్ఞాపకశక్తి సమస్యలు వస్తున్నాయి. మీకు నచ్చిన వ్యక్తులతో తరచూ మాట్లాడటం, జోకులు వేసుకోవడం, నవ్వు కోవడం, కోప్పడటం ఇలా అన్ని రకాల భావోద్వేగాలను వ్యక్త పరుస్తూ ఉండాలి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ మైండ్ ని షార్ప్ గా చేసుకోవచ్చు.
2. వ్యాయామం మెదడుకు కూడా..
వ్యాయామం శరీరం కోసమే కాదు. ఇది మీ మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. వారంలో 5 రోజులు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీరు నడవడం, జాగింగ్ చేయడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం లేదా ఏదైనా ఆటలు ఆడవచ్చు.
పజిల్స్ పరిష్కరించడం, చెస్ ఆడటం, కొత్త భాష నేర్చుకోవడం లేదా సంగీత వాయిద్యం నేర్చుకోవడం వంటి కార్యకలాపాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు యాక్టివ్ గా ఉండటం ముఖ్యం.
3. ఏ పనైనా ప్లానింగ్ తో చేయండి
ఇల్లైనా, ఆలోచనలైనా చిందరవందరగా ఉండే మనసంతా చిరాగ్గా మారిపోతుంది.ఏ పని చేస్తున్నా ఓ ప్లానింగ్ తో చేయండి. అప్పుడు ప్రశాంతంగా పని అవుతుంది. మీ మనసు కూడా దిగులు చెందదు. మీ పనులు మర్చిపోకుండా కరెక్ట్ గా జరగాలంటే ప్లానర్ లేదా రిమైండర్ యాప్‌లను ఉపయోగించండి. ఇది ముఖ్యమైన వాటిని ట్రాక్ చేయడానికి మీకు సహాయపడుతుంది. దీని వల్ల మీరు మానసికంగా బలంగా మారతారు.
ఇది కూడా చదవండి ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన, పురాతన శ్వాస వ్యాయామం ఇదిగో
4. బాగా నిద్రపోండి
తగినంత విశ్రాంతి లేకపోవడం కూడా జ్ఞాపకశక్తి తగ్గడానికి ఓ కారణం. పెద్దలైతే రాత్రి కనీసం 7 నుండి 9 గంటల నిద్ర పోవాలి. ఎప్పుడూ ఒకే టైమ్ కి పడుకొని, ఒకే టైమ్ కి లేవడం అలవాటు చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
5. ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి
మెదడు ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాలను తీసుకోండి. ఒమేగా-3 అధికంగా ఉండే సాల్మన్ ఫిష్, వాల్‌నట్స్, అవిసె గింజలు వంటివి తీసుకోండి. ఆకుకూరలు, బెర్రీలు, గింజలు కూడా మెదడుకు మంచివి. ఇవి మెదడు కణాలకు నష్టం కాకుండా కాపాడతాయి.
ధ్యానం, యోగా, వంటివి చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మతిమరపు పోతుంది. నాలెడ్జ్ పెరుగుతుంది.
మీకు ఈ సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి
• ముఖ్యమైన సమాచారాన్ని తరచుగా మరచిపోవడం.
• సూచనలను పాటించడంలో ఇబ్బంది పడటం లేదా తెలిసిన ప్రదేశాలలో తప్పిపోవడం.
• సరైన పదాలు కనుగొనడంలో కష్టపడటం లేదా ఒకే ప్రశ్నను పదే పదే అడగటం.
• గందరగోళం, మానసిక స్థితిలో మార్పులు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
ఇది కూడా చదవండి ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే ఇన్ని లాభాలా?