- Home
- Business
- Instagram Income: ఇన్‌స్టాలో నెలకు రూ.8లక్షలు సంపాదన, సబ్ స్క్రయిబ్ చేసుకునే వారికి స్పెషల్ పిక్స్
Instagram Income: ఇన్‌స్టాలో నెలకు రూ.8లక్షలు సంపాదన, సబ్ స్క్రయిబ్ చేసుకునే వారికి స్పెషల్ పిక్స్
ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో విపరీతంగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను తమిళ టీవీ నటి దర్శ గుప్తా బాగా ఉపయోగించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షల్లో సంపాదిస్తోంది.

దర్శ గుప్తా చాలా స్పెషల్
తమిళ టీవీ నటి దర్మ గుప్తా ఇన్ స్టాలో భారీగా సంపాదిస్తోంది. ఈ అమ్మడు డబ్బుకోసం సబ్ స్క్రిప్షన్ మొదలు పెట్టింది. ఆ సబ్ స్క్రిప్షన్ ద్వారానే నెలకు 8 లక్షల రూపాయలు, ఏడాది కోటి రూపాయలు సంపాదిస్తోంది. ఈమె కోయంబత్తూర్‌లో పుట్టి పెరిగింది. కాలేజీ చదువు తర్వాత బెంగళూరులోని ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసింది. అప్పుడే మోడలింగ్‌పై ఆసక్తితో, టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి, బుల్లితెరపై నటించేందుకు ప్రయత్నించింది.
కష్టాలు రావడంతో
'ముల్లుం మలరుం' అనే సీరియల్ ద్వారా దర్శ గుప్తా నటన మొదలుపెట్టింది. కానీ కరోనా లాక్‌డౌన్ తరువాత అవకాశాలు రాలేదు. ఇంట్లోనే రకరకాల ఫోటోషూట్‌లు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలు పెట్టి పాపులర్ అయింది. ఆమె అందానికి ఎంతో మంది పడిపోయారు. ఆమె పెట్టే గ్లామర్ ఫోటోల కోసం ఎంతో అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.
22 లక్షల ఫాలోవర్లు
దర్శ గుప్తాకు సినిమా, టీవీల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్ మీద ఆధారపడింది. ఈమెకు 22 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. వారిని నమ్ముకుని దర్శ కొత్త దారి పట్టింది. డబ్బులు కట్టి సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారికి తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టింది.
బికినీ ఫోటోలు కూడా
ఇన్‌స్టాలోసాధారణ ఫోటోలు పెట్టే దర్శను ఎంతో మంది అభిమానులు బికినీ ఫోటోలు కావాలని అడుగుతారు. వారికి ఆ ఫోటోలు నా సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంచుతానని, కావాలంటే మీరు కూడా సబ్‌స్క్రయిబ్ చేసుకొని చూడండి అని ఓపెన్‌గా చెబుతోంది.
ఎంత ఫీజు?
ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శ గుప్తా పేజీకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి నెలకు రూ.440 చెల్లించాలి. ఇప్పటివరకు ఆమెకు 1821 మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. దీని ద్వారా దర్శకు నెలకు రూ.8 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. తన సబ్‌స్క్రైబర్లను ఖుషీ చేయడానికి బికినీ ఫోటోలు, వీడియోలు పెడుతోంది. ఇలా ఆమెకు ఏడాదికి కోటి రూపాయలకు పైగా సంపాదిస్తోంది.