MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold: బంగారం ఇప్పుడే అస్సలు కొనకండి.. ఎందుకంటే?

Gold: బంగారం ఇప్పుడే అస్సలు కొనకండి.. ఎందుకంటే?

Gold: ధంతేరాస్, దీపావళి పండుగల వేళ బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగారం ధరలు మరింత ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 04 2026, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పడిపోతున్న పసిడి.. దివాళీకి ముందు బంగారం ధర మరింత డౌన్?
Image Credit : Asianet News

పడిపోతున్న పసిడి.. దివాళీకి ముందు బంగారం ధర మరింత డౌన్?

పండుగల సీజన్ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట బంగారం కొనుగోళ్ల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా ధంతేరాస్, దీపావళి వేళ పసిడి, వెండి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే, మీరు ఈ దీపావళికి పసిడి కొనే ఆలోచనలో ఉంటే కొద్ది రోజులు ఆగడం మంచిదని గ్లోబల్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గత కొన్ని నెలల్లో రికార్డు స్థాయి గరిష్ఠాలను నుంచి భారీగా పడిపోయిన పసిడి ధరలు, రాబోయే వారాల్లో మరింత తగ్గవచ్చని హెచ్చరిస్తున్నారు.

గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ (HSBC) తాజా రిపోర్టు ప్రకారం, ధంతేరాస్‌కు ముందు బంగారం ధరలపై ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ధరలు మరింత కిందకు దిగివచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హెచ్‌ఎస్‌బీసీ షాకింగ్ రిపోర్టు.. గోల్డ్ టార్గెట్ కోత
Image Credit : AI

హెచ్‌ఎస్‌బీసీ షాకింగ్ రిపోర్టు.. గోల్డ్ టార్గెట్ కోత

రాయిటర్స్ రిపోర్టు ప్రకారం.. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, ధరలపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎస్‌బీసీ తన 2026 సగటు పసిడి ధర అంచనాను భారీగా తగ్గించింది. గతంలో ఔన్సుకు 4,560 అమెరికన్ డాలర్లుగా ఉన్న అంచనాను ఇప్పుడు 4,490 డాలర్లకు సవరించింది. అదేవిధంగా 2027 నాటి సగటు ధర అంచనాను కూడా 4,925 డాలర్ల నుంచి 4,825 డాలర్లకు తగ్గించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బలపడుతున్న అమెరికన్ డాలర్, పెరుగుతున్న యూఎస్ బాండ్ ఈల్డ్స్, వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల పసిడిపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 మిగిలిన కాలంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సుకు 3,950 డాలర్ల నుంచి 4,600 డాలర్ల పరిధిలోనే కదిలే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది.

35
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి?
Image Credit : Asianet News

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి?

జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు ₹1.64 లక్షల ఆల్-టైమ్ రికార్డు గరిష్ఠాన్ని తాకింది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 4 నాటికి దేశీయ మార్కెట్‌లో నమోదైన సూచిక ధరల వివరాలు ఇలా ఉన్నాయి..

• 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): వివిధ ప్రాంతాల్లో ₹1,48,000 నుంచి ₹1,49,160 వరకు ఉంది. (హైదరాబాద్‌లో సుమారు ₹1,43,590 గా నమోదు)

• 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): వివిధ ప్రాంతాల్లో ₹1,36,000 నుంచి ₹1,36,750 వరకు ఉంది.

• వెండి ధర (1 కేజీ): సుమారు ₹2,35,000 వద్ద ఉంది.

• అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర: ఔన్సుకు 4,140 డాలర్ల నుంచి 4,490 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది.

45
పండుగల డిమాండ్‌తో ధరలు మళ్లీ పుంజుకుంటాయా?
Image Credit : Asianet News

పండుగల డిమాండ్‌తో ధరలు మళ్లీ పుంజుకుంటాయా?

భారతదేశంలో ధంతేరాస్, దీపావళి, రాబోయే పెళ్లిళ్ల సీజన్ల వల్ల పసిడికి భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ పండుగ డిమాండ్ ధరలు మరీ దారుణంగా పడిపోకుండా కొంతవరకు ఆదుకునే అవకాశం ఉందనేది నిజమే. అయితే, ఇప్పటికే దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ₹1.48 లక్షలకు పైగా ఉండటం వల్ల సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులు కాస్త వెనకడుగు వేస్తున్నారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ఎక్కువ బరువున్న ఆభరణాలు కొనడానికి బదులు లైట్ వెయిట్ జ్యువెలరీ, డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్ల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పండుగల సీజన్‌లో ఫిజికల్ డిమాండ్ పెరిగినా, అంతర్జాతీయంగా డాలర్ బలంగా ఉంటే మాత్రం రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశం తక్కువేనని చెబుతున్నారు.

55
ఈ పండుగ సీజన్లో పసిడి కొనుగోలుదారుల వ్యూహం ఏంటి?
Image Credit : Getty

ఈ పండుగ సీజన్లో పసిడి కొనుగోలుదారుల వ్యూహం ఏంటి?

ధం‌తేరాస్ లేదా దీపావళి వేళ బంగారం కొనాలనుకునే వారికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు..

1. వ్యక్తిగత, ఆభరణాల కొనుగోళ్లకు: ఇంట్లో పెళ్లిళ్లు లేదా సంప్రదాయాల కోసం ఆభరణాలు కొనాలనుకునేవారు మొత్తం డబ్బును ఒకేసారి పెట్టకూడదు. సిప్ పద్ధతిలో ధంతేరాస్‌కు ముందు లభించే ప్రతి డిప్‌లో కొద్దికొద్దిగా విడతలుగా కొనుగోలు చేయడం వల్ల ధరల్లోని హెచ్చుతగ్గుల నుంచి రక్షణ లభిస్తుంది.

2. పెట్టుబడి ప్రయోజనాల కోసం: కేవలం ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో పసిడిని దాచుకోవాలనుకునే వారు ఫిజికల్ జ్యువెలరీ జోలికి వెళ్లకుండా డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎంచుకోవడం మేలు. దీనివల్ల మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటి భారాలు తప్పుతాయి.

3. రశీదు, హాల్‌మార్క్ ముఖ్యం: బంగారం కొనేటప్పుడు కచ్చితంగా బీఐఎస్ హాల్‌మార్క్ ఉందో లేదో సరిచూసుకోవాలి. అలాగే పసిడి అసలు రేటు, మేకింగ్ ఛార్జీలు, 3 శాతం జీఎస్టీల పూర్తి వివరాలతో కూడిన బిల్లును కచ్చితంగా అడిగి తీసుకోవాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న బంగారం, వెండి ధరలు, మార్కెట్ అంచనాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించాము. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ పరిస్థితులను బట్టి పసిడి ధరలు నిమిష నిమిషానికి మారే అవకాశం ఉంటుంది. బంగారం లేదా ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టే ముందు లేదా భారీగా కొనుగోలు చేసే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బంగారం
వ్యాపారం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ 7 సెట్టింగ్స్ ఆఫ్ చేయకపోతే అకౌంట్ ఖాళీ
Recommended image2
Gold Price Fall: దసరా వేళ బంగారం భారీ పతనం...పసిడి ప్రియులకు పండగే పండగ
Recommended image3
Gold Price Hike: బంగారం ధరలకు రెక్కలు.. 10 గ్రాములపై ఏకంగా రూ.1,040 పెరుగుదల
Related Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ 7 సెట్టింగ్స్ ఆఫ్ చేయకపోతే అకౌంట్ ఖాళీ
Recommended image2
Andhra's Goa: గోవా దాకా ఎందుకు? మన దగ్గరే 'ఆంధ్రా గోవా'.. ఫుల్ డిటైల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved