HDFC Bank Owner: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు యజమాని ఎవరు? అతని ఆస్తులు ఎంత?
మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో HDFC ఒకటి. ఇది తన పెట్టుబడిదారులకు 1:1 బోనస్ షేర్లను కూడా ప్రకటించింది. ఎప్పుడైనా ఆలోచించారా అసలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు యజమాని ఎవరు? అతని ఆస్తులు ఎంత? అని.

HDFC అంటే ఏమిటి?
HDFC బ్యాంకు పూర్తి పేరు ‘హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్’. దీన్ని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇది భారతీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మే 2024 నాటికి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోని పదవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. ఏప్రిల్ 2024 నాటికి, HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ $145 బిలియన్లుగా ఉంది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్లలో మూడవ అతిపెద్ద కంపెనీగా నిలిచింది.
HDFC బ్యాంకును ఎవరు స్థాపించారు?
హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో HDFCని హస్ముఖ్ ఠాకోర్‌దాస్ పరేఖ్ (HT Parekh) 1977లో స్థాపించారు. భారతదేశంలో ప్రజలకు చవక ధరలకే ఇళ్లను అందించాలని ఆయన దీన్ని మొదలుపెట్టారు. 1994లో దాన్ని HDFC బ్యాంకుగా మార్చారు. అప్పటి నుండి ఇది మనదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌గా పేరు సంపాదించుకుంది.
HDFC బ్యాంక్ ప్రస్తుత యజమాని ఎవరు?
HDFC బ్యాంక్‌కి ఇప్పుడు యజమాని లేరు. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దీనికి ఒక వ్యక్తి యాజమాన్యం ఉండదు. అనేక మంది పెట్టుబడిదారులు, కంపెనీలు ఇందులో భాగంగా ఉంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చక్రవర్తి - పార్ట్ టైమ్ ఛైర్మన్ గా ఉన్నారు. ఎం. మిస్త్రీ - నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎండి రంగనాథ్ - ఇండిపెండెంట్ డైరెక్టర్, సందీప్ పరేఖ్ - ఇండిపెండెంట్ డైరెక్టర్, డాక్టర్ సునీతా మహేశ్వరి - ఇండిపెండెంట్ డైరెక్టర్, లిల్లీ వాదెరా - ఇండిపెండెంట్ డైరెక్టర్, రేణు సుద్ కర్నాడ్ - నాన్-ఎగ్జిక్యూటివ్ (నాన్-ఇండిపెండెంట్) డైరెక్టర్, డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా - ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇతర సభ్యులు ఉన్నారు.
HDFC బ్యాంక్ MD ఎవరు?
HDFC బ్యాంక్ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ, CEOగా శశిధర్ జగదీశన్ ఉన్నారు. ఆయన 2020లో ఈ పదవిని చేపట్టారు. ఆయన ముంబై విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్, షెఫీల్డ్ విశ్వవిద్యాలయం, UK నుండి మాస్టర్ ఇన్ ఎకనామిక్స్ ఆఫ్ మనీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పూర్తి చేశారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. HDFC బ్యాంక్‌లో ఆయన కెరీర్ గురించి చెప్పాలంటే, 1996లో ఫైనాన్స్ మేనేజర్‌గా, 1999లో ఫైనాన్స్ బిజినెస్ హెడ్‌గా, 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా 2020 నుండి MD, CEOగా ఉన్నారు.
షేర్ హోల్డింగ్ ఎలా ఉంది?
HDFC బ్యాంక్‌కి ఒక్క యజమాని లేరు… ఇందులో ఎంతో మంది వాటాదారులు ఉన్నారు. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. షేర్ హోల్డింగ్ నమూనా గురించి చెప్పాలంటే, జూన్ 2025 నాటికి ప్రమోటర్లు - సున్నా, FIIs - 48.84%, DIIs - DIIs, ప్రభుత్వం - 0.18%, పబ్లిక్ - 15.19%.
ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు?
HDFC బ్యాంక్ తాజాగా పెట్టుబడిదారులకు 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. వీటిని పొందడానికి చివరి తేదీ మంగళవారం, 26 ఆగస్టు. అంటే ప్రతి వాటాదారుడికి వారి ప్రస్తుత షేర్ల సంఖ్యకు సమానంగా బోనస్ షేర్లు లభిస్తాయి. ఉదాహరణకు, మీ వద్ద 100 HDFC బ్యాంక్ షేర్లు ఉంటే, మీకు 100 బోనస్ షేర్లు లభిస్తాయి. ఈ బోనస్ షేర్ జారీ తర్వాత మీ డీమాట్ ఖాతాలో మొత్తం షేర్లు 200 అవుతాయి.