మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా.. ? అయితే ఈ బెనిఫిట్స్ మిస్ అవ్వకండి!
ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డులను రెండంచుల కత్తి అంటారు. ఎందుకంటే ఒక వైపు ఆసరగా ఉంటుంది అలాగే సాధారణ వినియోగంతో మీరు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు, క్రెడిట్ స్కోర్ పెరుగుదలతో సహా కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు.మరోవైపు అవసరమైనంతగా ఉపయోగించకపోతే ఇంకా క్రమం తప్పకుండా తిరిగి చెల్లించకపోతే మీ జేబుకి భారాన్ని పెంచుతుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే, 49% ఛార్జీ ఉంటుంది. దీని వల్ల మీ లోన్ భారాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి మీరు మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహిస్తారు అనేది క్రెడిట్ కార్డ్ మీకు వరమా లేదా శాపమా అని నిర్ణయించుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలపై ఎక్కువ దృష్టి సారిస్తే ఇంకా బిల్ పేమెంట్స్ విషయంలో సరైన టైం పాటిస్తూ ఉంటే, అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల కొన్ని తక్కువ జనాదరణ పొందిన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది సమాచారం ఇక్కడ...
Your credit card swipes are giving RBI a headache
1. రోడ్‌సైడ్ అసిస్టెన్స్: కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై అత్యవసర రోడ్‌సైడ్ సహాయాన్ని అందిస్తాయి. అంటే బ్యాటరీ సమస్య, టైర్ ఫ్లాట్ కావడం లేదా పెట్రోల్ డీజిల్ లేకపోవడం వల్ల మీ వాహనం రోడ్డుపై ఇరుక్కుపోయినట్లయితే, కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు రోడ్‌సైడ్ సహాయాన్ని అందిస్తాయి. ఇంకా చాలా తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
2. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్: మీరు ట్రావెల్ సంబంధిత క్రెడిట్ కార్డ్‌ని కొన్నట్లయితే, మీరు విమానాశ్రయాలు, రైల్వేలలో ఉచిత లాంజ్ యాక్సెస్ పొందుతారు. మీకు ఎక్కువగా ప్రయాణాలు చేసే అలవాటు ఉంటే, క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. మీరు ట్రావెల్ హాలిడే వోచర్‌ను కూడా పొందవచ్చు.
3. ఎమర్జెన్సీ ట్రావెల్ బెనిఫిట్: క్రెడిట్ కార్డ్ మీ అన్ని ప్రయాణ అవసరాలకు అత్యవసర కవరేజ్ అందిస్తుంది. మీ బ్యాగేజీ పోయినట్లయితే, మీరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అలాగే, మీ ఫ్లైట్ ఆలస్యం అయితే లేదా ప్రయాణంలో మీరు గాయపడినట్లయితే, మీరు అత్యవసర ప్రయాణ ప్రయోజనాలను పొందవచ్చు. కానీ, ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి మీరు ట్రావెల్ ప్రోత్సాహకాలతో కూడిన క్రెడిట్ కార్డ్‌ని తీసుకోవాలి.
4. కొనుగోలుపై సెక్యూరిటీ: కొన్ని క్రెడిట్ కార్డ్‌లు వస్తువుల కొనుగోలుపై సెక్యూరిటీతో ఉంటాయి. దీని అర్థం మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువు లిమిట్ మొత్తం దాటి ఉంటె నిర్దిష్ట కాలానికి దాని రిపేర్ లేదా రీప్లేస్మెంట్ ఖర్చును కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది.
5. క్రెడిట్ స్కోర్ బిల్డింగ్: క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి లావాదేవీలు చేస్తున్నప్పుడు మన ఖాతా నుండి అడిషనల్ చార్జెస్ కట్ కాదు . కాకపోతే తర్వాత ఆ మొత్తం డబ్బును తిరిగి చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి సాధారణంగా ఒక నెల సమయం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది.