రైళ్లలో ప్రయాణించే మహిళల కోసం ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
మీరు భారతీయ రైల్వేలో ప్రయాణించినప్పుడల్లా మీ హక్కులు ఇంకా రైల్వే నియమాలను తెలుసుకోవడం చాల ముఖ్యం. అయితే సాధారణ ప్రయాణీకుల కోసం ఇండియన్ రైల్వే అనేక నియమాలను నిర్దేశించింది.
ఇండియన్ రైల్వేలు మహిళల కోసం ఎన్నో నిబంధనలు తీసుకొచ్చాయి. అయితే వీటిలో ఒంటరిగా ప్రయాణిస్తూ టిక్కెట్ తీసుకోలేకపోతే మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయి ? అనే సందేహాలపై వీరి కోసం అనేక నియమాలు నిర్దేశించబడ్డాయి. ఇలాంటి హక్కుల గురించి సాధారణంగా సామాన్యులకు అంతగా అవగాహన లేదు. కాబట్టి, ఈ నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
రైల్వే మహిళా కోటాలో 45 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాకుండా, 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా మహిళతో ప్రయాణించవచ్చు. అది కూడా ఆమెకి మహిళా కోటాలో మాత్రమే. ఇంతకుముందు స్లీపర్ క్లాస్‌లో మాత్రమే ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు ఏసీలో కూడా అందుబాటులోకి వచ్చింది.
మహిళలు ట్రైన్ బుక్ చేసుకోకపోతే లేదా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లయితే టీటీఈ వారిని రైలు నుండి దింపలేరు. భారతీయ రైల్వే చట్టం ప్రకారం, మహిళ కొన్ని షరతులతో రైలు ప్రయాణం కొనసాగించడానికి అనుమతించబడింది. అంతే కాకుండా రైలులో మహిళ ఒంటరిగా ప్రయాణిస్తుంటే టీటీఈతో మాట్లాడి సీటు మార్చుకోవచ్చు.
రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఎక్కువ హక్కులు ఉంటాయి. అయితే ఒక మహిళా ప్రయాణికురాలు టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తుంటే ఇలాంటి పరిస్థితిలో TTE ఆమెను రైలు కంపార్ట్‌మెంట్ నుండి బయటకు పంపంచలేరు.
TTE నెక్స్ట్ స్టేషన్‌లో టికెట్ తీసుకోమని మహిళను అడగవచ్చు. ఒక మహిళ వద్ద డబ్బు లేకపోతే, ఆమెపై ఒత్తిడి ఉండదు. ఈ చట్టం 1989లో రూపొందించబడింది. రాష్ట్రపతి నుంచి పోలీస్ మెడల్ ఇంకా ఇండియన్ పోలీస్ అవార్డు పొందిన మహిళా గ్రహీతలకు టికెట్ ఫీజులో 50 శాతం డిస్కౌంట్ ఉంటుంది.
అంతే కాకుండా యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలకు కూడా చార్జెస్ లో డిస్కౌంట్ ఇస్తారు. ప్రభుత్వం ప్రారంభించిన 182 హెల్ప్‌లైన్ ద్వారా మహిళలు భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను నివేదించవచ్చు.