డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? ఇలా చేస్తే భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు
DMart: నెలవారీ సామాన్లు కొనుగోలు చేసే చాలా మందికి కేరాఫ్ అడ్రస్ డీమార్ట్. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల ‘ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్’గా మారింది. అయితే డీమార్ట్‌లో సరైన పద్ధతిలో షాపింగ్ చేస్తే మరింత ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు.

డీ మార్ట్ ఎందుకు అంత పాపులర్?
DMart ప్రధాన బలం.. ‘తక్కువ ధర, మంచి నాణ్యత’. కిరాణా సామాగ్రి, దుస్తులు, గృహోపకరణాలు, క్లీనింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ ఇలా ప్రతీ విభాగంలో MRP కంటే తక్కువ ధరలు అందిస్తారు. మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 పట్టణాల వరకు తమ స్టోర్లను విస్తరించడం ద్వారా DMart ప్రతి వర్గానికి చేరుకుంది. ఇక పండుగ సీజన్‌లలో.. దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సందర్భాల్లో — ప్రత్యేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంది.
షాపింగ్ చేయడానికి సరైన సమయం ఏది?
DMartలో షాపింగ్ సమయం కూడా ఆదాపై ప్రభావం చూపుతుంది. వారాంతాల్లో (శని, ఆదివారాలు) స్టోర్లు ఎక్కువ రద్దీగా ఉంటాయి. ఈ సమయంలో ఆఫర్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం షాపింగ్ చేస్తే తక్కువ రద్దీతో పాటు మంచి ఆఫర్లను పొందవచ్చు. నెల ప్రారంభం కంటే మధ్యలో లేదా చివర్లో షాపింగ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే స్టాక్ క్లియర్ చేసే సమయంలో DMart భారీ తగ్గింపులు ఇస్తుంది.
డిస్కౌంట్లను పూర్తిగా వాడుకోవాలంటే
DMartలో గరిష్టంగా ఆదా చేయాలంటే ఈ చిన్న టిప్స్ గుర్తుంచుకోండి:
* ఎక్స్‌పైరీ డేట్ తప్పనిసరిగా చెక్ చేయండి. DMart తరచుగా గడువు దగ్గరలో ఉన్న ఉత్పత్తులపై పెద్ద డిస్కౌంట్ ఇస్తుంది. కానీ, వాటిని వాడే ముందు నాణ్యతను నిర్ధారించుకోండి.
* పరిమిత స్టాక్ ఆఫర్లు — "Limited Stock" అని ఉన్న ఉత్పత్తులు సాధారణంగా భారీ తగ్గింపుతో వస్తాయి. కానీ కొనుగోలు ముందు నాణ్యత, ప్యాకేజింగ్ చూడండి.
* ఆన్‌లైన్‌లో కూడా చూడండి. DMart Ready (డీ మార్ట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం) ద్వారా ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు స్టోర్ కంటే ఎక్కువ తగ్గింపు దొరుకుతుంది.
పండుగ సీజన్‌లో బల్క్ షాపింగ్ చేయండి
పండుగలు DMart కస్టమర్లకు ‘గోల్డెన్ సీజన్’. ఈ సమయంలో రైస్, ఆయిల్, స్నాక్స్, హోమ్ యుటిలిటీస్, డిటర్జెంట్స్ వంటి రోజువారీ వస్తువులను బల్క్‌గా కొనడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదా చేయవచ్చు. దీపావళి, సంక్రాంతి సమయంలో "Buy More Save More" ఆఫర్లు తరచుగా వస్తాయి. ఒకేసారి ఎక్కువ ఐటమ్స్ కొనుగోలు చేస్తే ధర తక్కువగా ఉంటుంది.
రిటర్న్ పాలసీ, బిల్లు చెక్ చేయడం మర్చిపోకండి
ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఫర్నిచర్ వంటి వస్తువులు కొనుగోలు చేసేప్పుడు DMart రిటర్న్ లేదా ఎక్స్చేంజ్ పాలసీని ముందుగానే తెలుసుకోండి. కొన్నిసార్లు బిల్లులో తప్పులు ఉండవచ్చు కాబట్టి బిల్లును వెంటనే చెక్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే, బిల్లును భద్రంగా ఉంచుకోవడం రిటర్న్ సమయంలో ఉపయోగపడుతుంది.