ఇటు అప్పులు.. అటు మార్కెట్లు: తీవ్ర ఒత్తిడితో సిద్ధార్థ ఇలా
First Published Aug 1, 2019, 11:15 AM IST
సంస్థ స్థాయిని మించి చేసిన అప్పులు కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణానికి దారి తీశాయి. స్థాయికి మించి పెరిగిన రుణాలకు తోడు పరిస్థితులను బట్టి మార్కెట్లలో సంస్థ షేర్ల పతనం కూడా ఆయనపై ఒత్తిడి పెంచాయి. చివరి క్షణం వరకు కొత్త అప్పుల కోసం ప్రయత్నించిన కేఫ్ కాఫీ అధినేత వీజీ సిద్ధార్థ చివరకు తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాఫీ బిజినెస్ మొగల్‌గా పేరు తెచ్చుకున్న వీజీ సిద్ధార్థ.. స్థాయికి మించి అప్పులు పెరిగిపోయి మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో సకాలంలో అప్పు లభించనందునే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఆయన తన చివరి లేఖలో పేర్కొన్నారు. తాను ఒక విఫల వ్యాపారవేత్తనని రాయడం వెనుక అసలు వాస్తవాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.

సిద్ధార్థ కుటుంబానికి కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌లో (సీడీఈ) 53.43 శాతం మేర వాటా ఉంది. ఇందులో 75 శాతం వాటాలు తాకట్టులో ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే సిద్ధార్థకు సీడీఈలో 32.75 శాతం వరకు వాటా ఉంది. వీటిల్లోనూ 70 శాతం తాకట్టులోనే ఉన్నాయి. ఆయన ఈ రుణాలను వివిధ వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలో రుణ భారాన్ని తగ్గించుకొనేందుకు సిద్ధార్థ మే3 నాటికి మైండ్‌ట్రీలో సీడీఈకి ఉన్న వాటాలను విక్రయించగా రూ.2,100 కోట్ల సొమ్ము వచ్చింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?