Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • క్రిప్టో కరెన్సీతో రూ.కోట్లు రావచ్చు.. మొత్తం పోవచ్చు.. ఎంత రిస్కో తెలుసా?

క్రిప్టో కరెన్సీతో రూ.కోట్లు రావచ్చు.. మొత్తం పోవచ్చు.. ఎంత రిస్కో తెలుసా?

Cryptocurrency: క్రిప్టోలో పెట్టుబడి పెడితే చాలా తక్కువ టైమ్ లో కోటీశ్వరులు అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు. ఇందులో నిజం కంటే రిస్కే ఎక్కువ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాపారం వెనుక రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందామా?  

Naga Surya Phani Kumar | Published : May 20 2025, 04:22 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
క్రిప్టోలో ఇంత రిస్క్ ఉందా?
Image Credit : our own

క్రిప్టోలో ఇంత రిస్క్ ఉందా?

క్రిప్టో అంటే ఏంటో సరిగ్గా తెలియకుండానే చాలామంది పెట్టుబడి పెడుతుంటారు. క్రిప్టో గురించి బాగా తెలుసుకుని పెడితేనే మోసపోకుండా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. పది సంవత్సరాల క్రితం బిట్‌కాయిన్‌లో వెయ్యి డాలర్లు పెట్టుంటే ఇప్పుడు మూడున్నర లక్షల డాలర్లు అయ్యేదట. షేర్ మార్కెట్‌లో వచ్చే లాభం కన్నా ఇది చాలా ఎక్కువ కాబట్టి ఐటీ ఉద్యోగులు క్రిప్టోలో పెట్టుబడి పెడుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

25
కంట్రోల్స్ లేని పెట్టుబడి
Image Credit : PR

కంట్రోల్స్ లేని పెట్టుబడి

కానీ క్రిప్టో పెట్టుబడికి ఎలాంటి కంట్రోల్స్ లేవు. అందుకే రిస్క్ కూడా చాలా ఎక్కువ. చాలా క్రిప్టోలు ఒక్కసారిగా వచ్చి మాయమైపోయాయి. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ తెలియదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. క్రిప్టోలో పెట్టుబడి పెట్టిన వాళ్ళలో చాలామంది డబ్బు అంతా కోల్పోయారని రిపోర్ట్స్ చెప్తున్నాయి.

Related Articles

SIP vs Government Schemes: రిటైర్మెంట్ డబ్బును ఈ స్కీమ్స్ లో పెట్టుబడిగా పెడితే డబ్బే డబ్బు
SIP vs Government Schemes: రిటైర్మెంట్ డబ్బును ఈ స్కీమ్స్ లో పెట్టుబడిగా పెడితే డబ్బే డబ్బు
Post Office Saving Schemes: ఈ పోస్టాఫీసు పథకాల్లో డబ్బులు పెడితే లాభాలే.. లాభాలు..!
Post Office Saving Schemes: ఈ పోస్టాఫీసు పథకాల్లో డబ్బులు పెడితే లాభాలే.. లాభాలు..!
35
లాభం వస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి
Image Credit : our own

లాభం వస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి

క్రిప్టో మార్కెట్ మన ఊహ ప్రకారం ఉండకపోతే పెట్టిన డబ్బు అంతా నిమిషాల్లో మాయమైపోతుంది. ఈ రిస్క్ తెలియక చాలామంది డబ్బు కోల్పోతున్నారని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది క్రిప్టోలో లాభాలు సంపాదిస్తున్నా.. ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వానికి చాలా డబ్బు కట్టాల్సి వస్తుంది. క్రిప్టో లాభాల మీద 30 శాతం ట్యాక్స్ కట్టాలన్న విషయం చాలామందికి తెలియదు.

45
పోయిన డబ్బు తిరిగి రాదు
Image Credit : Getty

పోయిన డబ్బు తిరిగి రాదు

షేర్ మార్కెట్‌లో నష్టపోతే తర్వాతి సంవత్సరాల్లో వచ్చే లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ క్రిప్టోలో అలా చేసుకునే వెసులుబాటు లేదన్న విషయం చాలామంది పెట్టుబడిదారులకు తెలియదు. క్రిప్టోలో ఒకసారి పోయిన డబ్బు తిరిగి సంపాదించడం ఉండదు. ఒకసారి డబ్బు పోయినా, వచ్చినా మళ్లీ మొదటి నుంచి సంపాదన మొదలు పెట్టాల్సిందే. అందుకే క్రిప్టోలో లాభాల కంటే రిస్క్ ఎక్కువ ఉందంటారు. 

55
రిస్క్ చేసి పెట్టుబడి పెట్టడం సరికాదు
Image Credit : Getty

రిస్క్ చేసి పెట్టుబడి పెట్టడం సరికాదు

క్రిప్టో విలువ నిర్ణయించడానికి ఒక ప్రామాణికం అంటూ లేదు. మార్కెట్ ఊహాగానాల ప్రకారమే క్రిప్టో విలువ నిర్ణయిస్తారు. కాబట్టి క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం సేఫ్ కాదు అని నిపుణులు చెప్తున్నారు. 

క్రిప్టో వ్యాపారానికి 1% ట్యాక్స్, లాభాల మీద 30% ట్యాక్స్ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకి అనుమతి ఇచ్చింది. ఈ విధానం సరైంది కాదని చాలామంది విమర్శిస్తుంటారు. కాని ప్రజలను ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలని ట్యాక్సులు అధికంగా వసూలు చేస్తున్నారన్నది అధికారుల సమాధానం. ఏదిఏమైనా కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
స్టాక్ మార్కెట్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories