వాహనదారులకు మరో షాక్.. పెట్రోలుతో పాటు సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు భారీగా పెంపు..

First Published Mar 2, 2021, 11:06 AM IST

పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి సిలిండర్  ధరల పెంపు తరువాత వాహనాల్లో ఉపయోగించే సిఎన్‌జి,  గృహావసరాల కోసం వినియోగించే  పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలను కూడా నేడు  పెంచాయి. ఢీల్లీతో సహా ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి ధర కిలోకు 70 పైసలు పెరిగగా  పిఎన్‌జి ధర 91 పైసలు పెరిగింది. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి.