MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పందులను విపరీతంగా తింటున్న చైనీయులు, దీంతో ఇండియాలో పెరిగిపోయిన షటిల్ కాక్ ధరలు

పందులను విపరీతంగా తింటున్న చైనీయులు, దీంతో ఇండియాలో పెరిగిపోయిన షటిల్ కాక్ ధరలు

చైనాయుల తిండి గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని జంతువులను తినే వారు చైనా వారేనని చెప్పుకుంటారు. ఇప్పుడు వారు బాతులకు బదులుగా పందులను అధికంగా తింటున్నారు. దాని ఫలితంగా భారతదేశంలో షటిల్ కాక్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 10 2025, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పందుల టేస్టే నచ్చిందట
Image Credit : Pixabay

పందుల టేస్టే నచ్చిందట

చైనా ఆహారపు అలవాట్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాములు, పురుగులు, గబ్బిలాలను కూడా వారు తింటారని అంటారు. అయితే చైనాలో అత్యంత ఇష్టంగా తినేది బాతు మాంసం. వారు బాతు మాంసం తిన్నంతకాలం మనకి షటిల్ కాక్ లకు ఎలాంటి కొదవ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వారు బాతు మాంసం తినడం తగ్గించేశారు. పందులను అధికంగా తింటున్నారు. దీనివల్ల మనదేశంలో బ్యాడ్మింటన్ ఆటకు కష్టకాలం మొదలైంది. గత ఏడాదిన్నరగా బాతు ఈకలతో చేసిన షటిల్ కాక్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మనదేశంలో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీలు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
షటిల్ కాక్ ధర ఎంత పెరిగింది?
Image Credit : Pixabay

షటిల్ కాక్ ధర ఎంత పెరిగింది?

గత ఏడాది ఒక షటిల్ కాక్ ధర 1200 రూపాయలు ఉండేది. ఈ ఏడాది బెంగళూరుకు చెందిన ఒక కోచ్ దానిని తిరిగి ఆర్డర్ చేశాడు. అయితే దాని ద్వారా 2,700 రూపాయలుగా చూపించింది. ఈ సంవత్సరం చివరినాటికి అది 3000 రూపాయలకు కూడా చేరుకోవచ్చు. చైనాలో బాతులు పెంచడం తగ్గిపోవడం వల్లే ఈకల కొరత ఏర్పడింది. ఆ ఈకల కొరత వల్ల షటిల్ కాక్ ధరలు పెరిగిపోయాయి. భారతదేశం, చైనా, ఇండోనేషియా దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటకు ఆదరణ పెరుగుతుంది. అందుకే బాతు ఈకల తక్కువ అవడంతో షటిల్ కాక్ ధరలు ఆ దేశాల్లో అధికంగా పెరిగిపోతున్నాయి.

35
బాతులే ఎందుకు?
Image Credit : Pixabay

బాతులే ఎందుకు?

అధిక నాణ్యత గల షటిల్ కాక్ లలో బాతు ఈకలను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి బలంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. చైనీస్ వారు బాతు మాంసాన్ని అధికంగా తింటారు. అలా తిన్నప్పుడు వారు ఈకలను తీసి వాటిని శుభ్రం చేసి షటిల్ కాక్ ల తయారీకి ముడి పదార్థంగా అమ్ముతారు. ఎప్పుడైతే వారు బాతు మాంసాన్ని తినడం తగ్గించేశారు. ఆ పక్షులను పెంచడం కూడా తక్కువగా అయిపోయింది. దీంతో బాతు ఈకలు దొరకడం కష్టంగా మారింది. అప్పుడు నుంచి షటిల్ కాక్ ల ఉత్పత్తి ప్రభావితమైంది.

45
షటిల్ అకాడమీలపై భారం
Image Credit : Pixabay

షటిల్ అకాడమీలపై భారం

భారతదేశంలోని షటిల్ కోచ్ లు మాట్లాడుతూ చాలాచోట్ల షటిల్ కాక్‌లు స్టాక్ కూడా లేదని చెబుతున్నారు. దీంతో అకాడమీలా ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. సాధారణ షటిల్ కాక్ ధర 1200 రూపాయలు నుండి 1700కి పెరిగింది. ఆ తర్వాత 2,250 రూపాయలకి వెళ్ళింది. ఇక ఈ ఏడాది 2,700కి పెరిగినట్టు షటిల్ కోచ్ లు చెబుతున్నారు. దీంతో అకాడమీ నెలవారీ ఖర్చులు ఒక 50,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.

55
ఇకపై ధనవంతుల ఆట
Image Credit : Pixabay

ఇకపై ధనవంతుల ఆట

పరిస్థితి ఇలాగే ఉంటే బ్యాడ్మింటన్ అనేది ధనవంతుల ఆటగా మారిపోతుంది. సామాన్యులు బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడం, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా కొంతవరకు పరిస్థితిని చక్కదిద్దవచ్చని కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు. అలాగే బ్యాడ్మింటన్ ఆట నేర్చుకుంటున్న ఆటగాళ్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకు కూడా భారతదేశం కృషి చేయాల్సి ఉంటుందని కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
చైనా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Fall: బంగారం మళ్లీ డౌన్ ఫాల్.. వెండి కొండెక్కింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!
Recommended image2
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image3
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved