8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం వస్తే పెరిగే జీతాన్ని ఇలా లెక్క వేయండి
8th Pay Commission: ఎనిమిదవ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఇది వచ్చే అవకాశం ఉంది. ఎనిమిదో పే కమిషన్ అమల్లోకి వస్తే జీతాలు ఎంత పెరుగుతాయో ఇలా లెక్క వేసుకోండి.

ఎనిమిదో వేతన సంఘం
ఎనిమిదవ వేతన సంఘానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. మంత్రివర్గం ఆ వేతన సంఘానికి సంబంధించిన నిబంధనలను కూడా ఆమోదించింది. దీంతో ఈ కొత్త వేతన సంఘం జనవరి 1, 2026ని అమల్లోకి వస్తుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వారి జీవితంలో కూడా ఎంతో పెరుగుదల ఉంటుంది.
ఏ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి?
ఎనిమిదో వేతన సంఘం రాగానే మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో భారతీయ రైల్వే, పోస్టల్ డిపార్ట్మెంట్, కస్టమ్స్, ఆదాయపు పన్ను శాఖ వంటి పెద్ద విభాగాల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. వారికే మొదట నేరుగా జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. వేతన సంఘం విడుదల అవ్వగానే వెంటనే వీరి జీతాలు పెరుగుతాయి.
వీరందరికీ భారీ జీతాలు
ఇక భారత సైన్యం, నేవి ఉద్యోగులు, వైమానిక దళ ఉద్యోగులు కూడా ఎనిమిదో వేతన సంఘం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందుతారు. దాదాపు దేశం కోసం పనిచేస్తున్న ప్రతి సైనికుడికి ఎనిమిదో వేతన సంఘం వల్ల లాభం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఈ బలగాలన్నీ వస్తాయి. ఇక జీతం ఎంత పెరుగుతుంది అనేది ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలలో పనిచేసే వారికి కూడా జీతం పెరుగుదల ఉంటుంది. ఐఐఎం, ఐఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఇక పింఛనుదారులకు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది.
జీతం ఇలా లెక్క వేయండి
ఎనిమిదవ వేతన సంఘం వచ్చాక మొదట ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను నిర్ణయిస్తారు. ఇది 1.83 శాతం నుంచి 2.86 శాతం వరకు ఉంటుంది. 1.83 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చి ఉంటే ఒక ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకోండి. ఒక ఉద్యోగి బేసిక్ జీతం 20,000 రూపాయలు అనుకుందాం. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 1.83 ఇస్తే 20,000 X 1.83 = 36,600 రూపాయలు బేసిక్ పే అవుతుంది. అదే 2.85 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే 20,000 X 2.85 = 57000 రూపాయలు బేసిక్ పే అవుతుంది. ఇక ఈ బేసిక్ పై ఆధారంగానే హెచ్ఆర్ఏ, డిఏ వంటి అలవెన్సులు కూడా పెరుగుతాయి. దీనివల్ల ప్రతినెలా చేతికందే జీతం రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంచనాల ప్రకారం ప్రతి ఉద్యోగ జీతం కనీసం 30 శాతానికి పైగా పెరుగుతుంది.