- Home
- Business
- Ambani Assets: అంబానీ ఇల్లుతో సహా ఆస్తులన్నీ జప్తు, చివరికి తూర్పుగోదావరిలో ఉన్న స్థిరాస్తులు కూడా
Ambani Assets: అంబానీ ఇల్లుతో సహా ఆస్తులన్నీ జప్తు, చివరికి తూర్పుగోదావరిలో ఉన్న స్థిరాస్తులు కూడా
Ambani Assets: అనిల్ అంబానీకి అతి పెద్ద కష్టం వచ్చింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అయిన అనిల్ కు చెందిన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఆస్తులు ఉన్నాయి.

అనిల్ అంబానీ కష్టాలు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆయనకు చెందిన ఆస్తులు అన్నిటినీ జప్తు చేసింది ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ మేరకు సోమవారం ప్రకటన కూడా చేసింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ చర్యలకు దిగినట్లు ఈడీ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు అనిల్ అంబానీ లేదా అతని గ్రూప్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.
కష్టాల్లో అనిల్ అంబానీ
అనిల్ అంబానీ కుటుంబం ప్రస్తుతం నివాసం ఉంటున్న ముంబైలోని ఇంటితో పాటు ఆయన గ్రూపుకు చెందిన ఎన్నో నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఈడీ. అతనికి హైదరాబాదులోని సోమాజిగూడులో కామస్ కాప్రి అపార్ట్మెంట్స్ లో రెండు లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని కూడా జప్తు చేయాల్సిన ఆస్తులు జాబితాలో పెట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. వాటిని కూడా అటాచ్ చేసింది. వీటితో పాటు ముంబై, నోయిడా, థానే, ఢిల్లీ, పూణే, చెన్నై, ఘజియాబాద్ లో ఉన్న స్థిరాస్తులను కూడా జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.
అన్నీ ఆస్తులు జప్తు
ముంబైలో ఉన్న ధీరుభాయి అంబానీ నాలెడ్జ్ సిటీ 32 ఎకరాల్లో ఉంది. దీన్ని కూడా అటాచ్ చేసింది. దీని విలువ 4,462 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ జప్తు జరుగుతోంది. ఇప్పటివరకు అనిల్ అంబానీకి చెందిన 7,545 కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది.
ఎంత అప్పు తీసుకున్నారు?
రిలయన్స్ కమ్యూనికేషన్స్... దీన్నే ఆర్ కామ్ అంటారు. దీంతోపాటు సంబంధిత కంపెనీలు తీసుకున్న రుణాలు అన్నీ కూడా మోసపూరితమైనవేనని అధికారులు తేల్చారు. ఈ కంపెనీల పేరుతో రుణాలు తీసుకొని వాటిని ఇతర గ్రూపు కంపెనీలోకి మళ్లించినట్టు నిర్ధారణ అయింది. దాదాపు 13,600 కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణం రూపంలో తీసుకున్నారని ఈడీ చెబుతోంది. దీనిపై ఎప్పటినుంచో సోదాలు జరుగుతూనే ఉన్నాయి. హవాలా, నిదుల మళ్లింపు వంటి కేసుల్లో ప్రస్తుతం అనిల్ అంబానీ ఇరుక్కుపోయారు.