ఇప్పుడే 1 గ్రాము బంగారం కొనండి.. 2.50% వడ్డీ పొందండి.. మోడీ ప్రభుత్వ సూపర్ స్కీమ్..
బంగారంపై డిజిటల్‌గా పెట్టుబడి పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వడ్డీ కూడా పొందవచ్చు. ఈ పథకం కింద మీకు 2.50% వడ్డీ లభిస్తుంది. అయితే దీని సంబంధించినా సమాచారం మీకోసం..
సావరిన్ గోల్డ్ బాండ్
మరికొద్దిరోజుల్లో ధన్‌తెరాస్ పండుగ జరగనుంది. ఈ సమయంలో బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. నిజానికి ఈ రోజున చాలా మంది బంగారం కొంటారు. అయితే, గత కొన్నేళ్లుగా డిజిటల్ బంగారం డిమాండ్ కూడా పెరిగింది. బంగారంపై డిజిటల్‌గా పెట్టుబడి పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వడ్డీ కూడా పొందవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ 2023
ఇందుకోసం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) లేదా సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ గురించి చెప్పాలంటే మీరు ఈ పథకంలో పెట్టుబడి పెడితే, మీరు బంగారం పై భద్రత, స్వచ్ఛతను పొందడమే కాకుండా వడ్డీని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.
గోల్డ్ బాండ్లు
నిజానికి, కేంద్ర ప్రభుత్వం 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ బంగారం అనేది పెట్టుబడి, దానిపై వడ్డీని పొందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు సామాన్యులకు ఎప్పటికప్పుడు అవకాశాలు కల్పిస్తోంది. దీని కింద మీరు ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది.
బంగారం కొనుగోలుదారులు
సాధారణంగా ఈ బంగారం ధర సాధారణ మార్కెట్ కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా డిజిటల్‌గా చెల్లిస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ బంగారాన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL), NSE అండ్ BSE వంటి అధీకృత స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి కొనుగోలు చేయవచ్చు.
బంగారం పెట్టుబడి
ఈ బాండ్లు ఎనిమిదేళ్ల కాలానికి ఉంటుంది. అయితే ఎనిమిది సంవత్సరాల వ్యవధి దాటితే మెచ్యురిటీ సంభవిస్తుంది. అయితే, 5, 6 ఇంకా 7 సంవత్సరాలలో ఎగ్జిట్ అప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఈ పెట్టుబడిపై వార్షిక వడ్డీ రేటు 2.50 శాతంగా నిర్ణయించింది. వడ్డీ ఆరు నెలల వ్యవధిలో చెల్లించబడుతుంది.