Business Ideas: మహిళలు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇల్లు కదలకుండానే నెలకు రూ. 3 లక్షలు సంపాదించే బిజినెస్ ఇదే..
వ్యాపారం చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే పెట్టుబడి సమీకరించి వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందేందుకు ప్రయత్నం చేయండి. ప్రస్తుతం నువ్వు చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీరు వ్యాపారంలో రాణించండి. తద్వారా ప్రతి నెల లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పటికీ తిరుగులేని వ్యాపారం అనే చెప్పాలి. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చాలా ఎక్కువ మార్జిన్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు ఫుడ్ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించాలి, అనుకుంటే క్లౌడ్ కిచెన్ అనేది ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పాలి. మీకు వంటలో మంచి ప్రావీణ్యం ఉండి రెస్టారెంట్ స్టైల్ లో వంట చేయగలిగితే మాత్రం మీకు చాలా అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి అవకాశం మీకు క్లౌడ్ కిచెన్ ద్వారా లభిస్తుంది.
క్లౌడ్ కిచెన్ కోసం మీరు ఇంట్లోనే ఓ గదిని కేటాయించాల్సి ఉంటుంది. ఆ గదిలో రెస్టారెంట్ స్టైల్ కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కలెక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వర్కర్స్ ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. fssai నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. అనంతరం స్థానిక మున్సిపాలిటీ నుంచి సైతం మీరు అనుమతులు పొందాల్సి ఉంటుంది. తద్వారా మీరు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రారంభంలో మీరు క్లౌడ్ కిచెన్ పై లక్ష నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
అనంతరం మీరు క్లౌడ్ కిచెన్ ద్వారా ఆర్డర్లను పొందాలి అనుకుంటే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఫుడ్ డెలివరీ యాప్స్ తో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఆర్డర్లను ఎప్పటికప్పుడు పొందవచ్చు. దీంతో పాటు మీరు కూడా స్వయంగా ఒక ఫోన్ నెంబర్ ద్వారా మీ క్లౌడ్ కిచెన్ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరీ చేసినట్లయితే చక్కటి ఆర్డర్లను పొందవచ్చు. ఇందుకోసం డెలివరీ బాయ్స్ కు కమిషన్ ప్రాతిపదికన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
క్లౌడ్ కిచెన్ లో మెనూ విషయానికి వస్తే మీ ఏరియాలో ఏ ఆహారానికి ఎక్కువగా డిమాండ్ ఉందో గమనించి ఆ తరహా వంటకాలను సిద్ధం చేస్తే మంచిది. కొన్ని ఏరియాలో నాన్ వెజ్ వంటకాలు ఎక్కువగా పోతాయి. అలాంటి ప్రదేశాల్లో మీరు బిరియాని నార్త్ ఇండియా వంటకాలను అందుబాటులో ఉంచితే మంచిది. ఉద్యోగస్తులు విద్యార్థులు ఉన్న ప్రదేశాల్లో సాధారణ మీల్స్ కూడా అందుబాటులో ఉంచితే ఎక్కువగా గిరాకీ లభించే అవకాశం ఉంది. ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా ప్రతినెల 50 వేల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.