Business Ideas: మహిళలు మీ సమయంలో కేవలం 4 గంటలు కేటాయిస్తే చాలు..నెలకు రూ. 1 లక్ష దాకా ఆదాయం మీ సొంతం..
మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా.. అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు పెట్టుబడి కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్రా రుణాల ద్వారా మీరు ఈ వ్యాపారం ప్రారంభించినట్లయితే, చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా మహిళలు తమ ఖాళీ సమయంలో ఆదాయం సంపాదించాలి అనుకున్నట్లయితే, ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలు తినాలనే ఆలోచన పెరుగుతోంది. ముఖ్యంగా బీపీ షుగర్ థైరాయిడ్ వంటి వ్యాధుల నేపథ్యంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తినాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలు ఉంది.
మహిళలు మీరు ఖాళీ సమయంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చిరుతిళ్లు, అదేవిధంగా పలు రకాల స్నాక్స్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం మార్గం పొందే వీలుంది. ముఖ్యంగా చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, వినియోగించి స్నాక్స్ తయారు చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది.
ఇందుకోసం మీరు ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది. పలు ఉపాధి శిక్షణా కేంద్రాలు అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ కేంద్రాలు సైతం షార్ట్ టర్మ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తద్వారా మీరు నైపుణ్యం పొందే వీలుంది. మీరు పెద్ద ఎత్తున ఈ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే కొన్ని యంత్రాలను కూడా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కాస్త పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా మీ ఉత్పత్తులను విక్రయించాలి అనుకున్నట్లయితే FSSAI సంస్థ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికంగా కూడా పర్మిషన్లు తీసుకున్నట్లయితే, మీ వ్యాపారం సాఫీగా సాగే అవకాశం ఉంది. ఇక ఉత్పత్తుల విషయానికి వచ్చినట్లయితే చిరుధాన్యాలతో చేసినటువంటి ఐటమ్స్ అయినా అప్పడాలు, బిస్కెట్లు, కార్న్ ప్లెక్స్, ప్రోటీన్ మాల్ట్ పౌడర్లు, చిక్కీలు పొడులు వంటివి తయారు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేకమైనటువంటి లో కాలరీ స్వీట్లు తయారు చేయడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది వీటిని మీరు రిటైల్ దుకాణాలకు హోల్సేల్ ధరలకు విక్రయించవచ్చు లేదంటే మీరే సొంతంగా షాపు ఏర్పాటు చేసుకొని వీటిని విక్రయించుకోవచ్చు మీరు తయారు చేసే ఆహార పదార్థాలను మెనూ రూపంలో డిస్ ప్లే చేయడం ద్వారా ప్రజలకు అర్థం అవుతుంది అదేవిధంగా సోషల్ మీడియాలోని పలు రకాల వేదికల ద్వారా మీరు పబ్లిసిటీ చేసుకోవచ్చు.