Business Ideas: నిరుద్యోగులు మీ వద్ద కేవలం 100 గజాల స్థలం ఉంటే చాలు, నెలకు రూ. 1`లక్ష సంపాదించే చాన్స్..
నిరుద్యోగులు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా, అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి, ముద్రా రుణాల ద్వారా మీరు చక్కగా వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలను ఆదాయం పొందవచ్చు.
ముద్ర రుణాలను పొందాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో మీరు ముద్రా రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు. కనిష్టంగా 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల ముద్ర రుణం ద్వారా పొందే వీలుంది కనుక మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మీ సమీపంలోని ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి లోను కోసం అప్లై చేసుకోవచ్చు తద్వారా చక్కటి వ్యాపారం ప్రారంభించేందుకు పెట్టుబడి మీకు లభిస్తుంది.
ఇక పెట్టుబడి లభించిన తర్వాత ఏం వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా. అయితే ఫుడ్ బిజినెస్ ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ రంగంలో మంచి లాభం ఉంటుంది ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు మంచి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.
అల్లం వెల్లుల్లి పేస్టు అనేది భారతీయ వంటకాల్లో దాదాపు అన్నింట్లోనూ విరివిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మసాలా వంటలు అల్లం వెల్లుల్లి పేస్టును ఎక్కువగా వాడుతుంటారు. బిర్యానీ చేసిన నాన్ వెజ్ వంటకాలు అలాగే వెజ్ వంటకాలు సైతం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే మీరు దీన్ని చక్కటి వ్యాపార అవకాశంగా మలుచుకునే వీలుంది.
ఈ రంగంలో ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు సైతం ప్రవేశించాయి. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు సైతం అల్లం వెల్లుల్లి పేస్ట్ ను విక్రయిస్తున్నాయి. అయినప్పటికీ మీరు ఈ వ్యాపారంలో ప్రవేశించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అల్లం వెల్లుల్లి పేస్టు తయారు యూనిట్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్టు తయారు యూనిట్ కోసం సుమారు 100 నుంచి 150 చదరపు గజాల స్థలం సరిపోతుంది. ఈ స్థలంలోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్ స్థాపించవచ్చు. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కోసం కమర్షియల్ గ్రైండర్ కొనుగోలు చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ప్యాకింగ్ కోసం ప్యాకింగ్ యంత్రాన్ని కూడా కొనుగోలు చేసుకోవాలి. ఇందుకోసం ప్రారంభం పెట్టుబడి కింద సుమారు ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది.
ఇక తయారీ యూనిట్ కోసం మీరు స్థానికంగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అలాగే కరెంటు సదుపాయం కూడా పొందాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా పొందాలి. దీంతోపాటు జీఎస్టీ నెంబర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి శుభ్రమైన పద్ధతిలో పేస్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. అప్పుడే మీకు చక్కటి లాభం లభిస్తుంది. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇక తయారీ అనంతరం మార్కెటింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కిరాణా దుకాణాలకు 50 గ్రాములు 100 గ్రాముల ప్యాకెట్ల రూపంలో విక్రయించవచ్చు. అలాగే హోల్సేల్ మార్కెట్లో ఒక కేజీ అరకేజీ రూపంలో కంటైనర్లను విక్రయించవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కు ఎక్కువగా హోటళ్లు, కర్రీ పాయింట్స్, హాస్టళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసుల వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కావున మీరు వారితో నేరుగా ఒప్పందం చేసుకొని మంచి ఆర్డర్లను పొందే వీలుంది ఈ వ్యాపారం ద్వారా మీరు నెలకు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.
గమనిక: పైన పేర్కొన్నటువంటి బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వ్యాపారంలోకి ప్రవేశించేముందు పూర్తి వివరాలను అనుభవజ్ఞుల వద్ద నుంచి తెలుసుకోవడం ముఖ్యం. మీరు చేసే వ్యాపారానికి ఏషియన్ న్యూస్ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు.