- Home
- Business
- Business Ideas: ఆవుపేడతో నెలకు రూ.3 లక్షల ఆదాయం..ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..సీఎం సైతం షాకైన బిజినెస్ ఇదే..
Business Ideas: ఆవుపేడతో నెలకు రూ.3 లక్షల ఆదాయం..ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..సీఎం సైతం షాకైన బిజినెస్ ఇదే..
దేశంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వెతుక్కునే బదులు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల ద్వారా మరింత ఎక్కువగా సంపాదించుకునే వీలుంది. ముఖ్యంగా గో సంపద ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులతో ఓ నిరుద్యోగ యువకుడు సాధించిన విజయం తెలుసుకుందాం.

సాధారణంగా మనం వేటినైతే వేస్ట్ అని పేరు పెట్టి పారేస్తామో...వాటిని సద్వినియోగం చేసుకుంటే నెల నెలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఆవు పేడ అటువంటి ఉత్పత్తిలో ఒకటి, గోధనంగా పేరొందిన ఆవు పేడతో తయారుచేసిన వస్తువులను విక్రయించి కొందరు ప్రతి నెలా లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.
రాయ్‌పూర్‌కు చెందిన 'ఏక్ పహల్' సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఆవు పేడతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ప్రతి నెలా మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఆవు పేడతో ఎన్నో ఉత్పత్తులను ఆయన తయారు చేసి విక్రయిస్తున్నాడు. విశేషమేమిటంటే.. తన సంపాదనతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ పత్రాలు తెచ్చిన బ్రీఫ్‌కేస్ ఆవు పేడతో తయారు చేసిందని సభా ముఖంగా తెలిపారు. దీంతో ఈ బ్యాగ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రితేష్ బృందం 10 రోజుల్లో ఈ బ్యాగ్‌ని తయారు చేసింది. ఆ తర్వాత ఇది మరింత చర్చనీయాంశమైంది.
ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోండి
రాయ్‌పూర్‌లో చదువుకున్న రితేష్ 2003లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత చాలా కంపెనీల్లో పనిచేశాడు. ఉద్యోగ సమయంలో సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో రితేష్‌లో వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. చెత్త తిని అనారోగ్యానికి గురవుతున్న ఆవులను వీధుల్లో చూసి చలించిపోయేవాడు. వాటి పరిస్థితి చూసి రితేష్ తట్టుకోలేక 2015లో ఉద్యోగం వదిలేసి గోశాలను నిర్మించాడు. ఆ సమయంలో ఆవు పేడ నుండి సంపాదించాలనే ఆలోచన అతని మదిలో వచ్చింది.
ఏయే ఉత్పత్తులను తయారు చేయవచ్చో తెలుసుకోండి
రితేష్ ఆవు పేడతో చెప్పులు, పర్సులు, బ్యాగులు, శిల్పాలు, దీపాలు, ఇటుకలు, రంగులు విక్రయిస్తున్నాడు. విశేషమేమిటంటే.. హోలీ సందర్భంగా ఆవు పేడతో పర్యావరణహితమైన రంగులను కూడా తయారు చేసి విక్రయించాడు. దీంతో ప్రతినెలా రూ.3 లక్షలు సంపాదిస్తూ 23 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం
రితేష్ ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అతను ఆవు పేడతో అనేక రంగులను తయారు చేశాడు. ఇవి పర్యావరణ అనుకూలమైనది. దేశవ్యాప్తంగా ఈ రంగులను కిలోకు రూ.300 చొప్పున మార్కెట్ చేశారు. నేడు అతని వద్ద 400 పైగా ఆవులు ఉన్నాయి.