- Home
- Business
- Business Ideas: ఉద్యోగం కోసం టైం వేస్ట్ వద్దు, కేవలం రూ. 1 లక్షతో ఈ బిజినెస్ చేస్తే నెలకు 3 లక్షలు మీ సొంతం
Business Ideas: ఉద్యోగం కోసం టైం వేస్ట్ వద్దు, కేవలం రూ. 1 లక్షతో ఈ బిజినెస్ చేస్తే నెలకు 3 లక్షలు మీ సొంతం
ఉద్యోగం కోసం ఎదురు చూసి సమయం వృధా చేసుకుంటున్నారా. అయితే ఇకపై ఏమాత్రం నష్టం చేయకండి. వెంటనే వ్యాపారం ప్రారంభించి డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. లేకపోతే జీవితంలో విలువైన సమయాన్ని మీరు నష్టపోయే ప్రమాదం ఉంది.

యువత తలుచుకుంటే ఎలాంటి పని అయినా చేసి డబ్బు సంపాదించవచ్చు. అందుకే మీరు మీ వయసును యవ్వనాన్ని వృధా చేసుకోకుండా మంచి బిజినెస్ ప్రారంభిస్తే చిన్న వయసు నుంచే చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. . అయితే ఏం బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తున్నారా ఇందుకోసం ఓ మంచి ఐడియా తో మీ ముందుకు వచ్చేసాము.
ఫుడ్ బిజినెస్ రంగంలో లాభం ఎక్కువగా ఉంటుందని ప్రతి ఒక్కరు చెబుతుంటారు. ఇది నిజమే ఫుడ్ బిజినెస్ చక్కగా నిర్వహించుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం లభిస్తుంది ఎందుకంటే ఫుడ్ బిజినెస్ లో ఎప్పటికీ లాభాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ కు సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ బిజినెస్ లకు చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో చైనీస్ వంటకాలకు మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా నూడుల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియా వంటి పదార్థాలను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా యువత వీటిని తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మీరు జన సమర్థం ఉన్న ప్రదేశాల్లో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంటే చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. ముందుగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు కావలసిన సామర్థ్యం ఏంటో అలాగే పెట్టుబడి ఎంత అవుతుందో తెలుసుకుందాం.
చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మీరు ఒక ఫుడ్ స్టాల్ రూపంలోనూ లేదా ఓ షాపుల రెంటుకు తీసుకొని సైతం ప్రారంభించవచ్చు. అయితే మీరు ప్రారంభించే ప్రాంతంలో కాలేజీలు ఆఫీసులో అదేవిధంగా . జన సమర్థత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు మంచి గిరాకీలు లభిస్తాయి. ముందుగా ఓ షాపును రెంటుకు తీసుకొని అందులో మీరు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తయారీకి తగినట్లుగా స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ స్టాల్ కొనుక్కోవాలి చేసుకోవాలి దీని ధర సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది.
అలాగే ఇతర వంట సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోవాలి వీటి ధర సుమారు పదివేల నుంచి 20వేల రూపాయల వరకు ఉంటాయి. ఇక మీరు వండేందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. . అలాగే కస్టమర్లు కూర్చునేందుకు కొన్ని కుర్చీలను టేబుళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మొత్తంగా మీ ఖర్చు పెట్టుబడి సుమారు ఒక లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు అవుతుంది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లు అదేవిధంగా నేపాల్ దేశానికి చెందిన వాళ్ళు ఈ ఫాస్ట్ ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వంటకాలను సులభంగా తయారు చేస్తారు. వారిని మీరు పనిలో పెట్టుకుంటే సరిపోతుంది. లేదా మీరే స్వయంగా నేర్చుకోవాలి అనుకుంటే పలు హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు అలాగే కలినరీ ఆర్ట్స్ సంస్థలు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వంటకాల తయారీ పై షార్ట్ టర్మ్ కోర్సులను నిర్వహిస్తాయి వాటిలో శిక్షణ పొంది మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు.
ఏ వ్యాపారానికైనా రుచి నాణ్యత అన్నవి తప్పనిసరి ఈ రెండింటిని చక్కగా మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీ వ్యాపారం రెండింతలు మూడింతలు అవుతుంది. మీ వ్యాపారం బాగుంటే ప్రతిరోజు కనీసం కౌంటర్ పై 20 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఖర్చులు పోను మీకు రోజుకు పదివేల వరకు మిగులుతాయి. అంటే నెలకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు సంపాదించుకునే వీలుంది.