- Home
- Business
- Business Ideas: డిగ్రీ ఫెయిలైనా పర్లేదు, ఈ బిజినెస్ చేస్తే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కన్నా కూడా ఎక్కువ ఆదాయం
Business Ideas: డిగ్రీ ఫెయిలైనా పర్లేదు, ఈ బిజినెస్ చేస్తే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కన్నా కూడా ఎక్కువ ఆదాయం
మిత్రులారా బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే మీ బిజినెస్ కు తగ్గ పెట్టుబడి ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారా. ఇక ఏమాత్రం ఆలోచించవద్దు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల నుంచి నిరుద్యోగులకు ముద్రా రుణాలను అందజేస్తోంది. ముద్రా రుణాలను పదివేల నుంచి పది లక్షల వరకు పొందే వీలుంది. అంతేకాదు బయట వ్యాపారులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణం పొందడం చాలా సురక్షితం అధిక వడ్డీల బాధ ఉండదు.

ఇప్పుడు ఇక సరికొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు కూడా ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే వెంటనే పరాటా సెంటర్ పెట్టుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఉత్తర భారత దేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ పరాటాలను ఎక్కువగా తింటారు.
మన రాష్ట్రంలో సైతం ముఖ్యంగా పట్టణాల్లో కొత్త కొత్త రుచులు చూసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ పరాటా వంటకం రుచి చూపించి మంచి వ్యాపారం ప్రారంభించవచ్చు. పరాటా అంటే గోధుమపిండి రొట్టి మధ్యలో ఏదైనా ఒక వంటకం అంటే ఆలు గడ్డ, పన్నీరు, చికెన్ లేదా మరి ఇతర వంటకాన్ని అయినా పెట్టి చపాతీలుగా మలచి కాలుస్తుంటారు. వేడివేడి పరాటాలను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు.
ఇప్పుడు ఇక పరాటా సెంటర్ ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ముందుగా ఒక జన సమర్థత మున్న ప్రదేశంలో ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి మీరు ఈ పరాటా సెంటర్ ఏర్పాటు చేయవచ్చు. ఆలు పరాటా గోబీ పరాటా పాలక్ పరాటా ఇలా ఒక మెనూ తయారు చేసుకొని మీరు పరాటాలు విక్రయిస్తే మంచి ఆదాయం పొందే వీలుంది. మీకు పరాటా తయారు చేయడంలో అనుభవం లేకపోతే శిక్షణ పొందడం అత్యుత్తమమైన పని. హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో అలాగే హోం సైన్స్ కోర్సులు అందిస్తున్న కాలేజీల్లో ఇటువంటి వంటకాలు ఎలా తయారు చేయాలో షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి. వారి వద్ద మీరు పరాటా తయారీ మెలకువలను నేర్చుకొని సెంటర్ పెడితే చక్కటి ఆదాయం పొందే వీలుంది.
ఇక పరాటా తయారీలో మీరు నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు. ఇంకా పెట్టుబడి విషయానికి వస్తే పరాటా సెంటర్ ఏర్పాటు చేయటానికి, సుమారుగా సుమారుగా 50 వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇందులో షాపు రెంట్ విషయానికి వస్తే అది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక కొన్ని గిన్నెలు ప్లేట్లు చపాతీలు కాల్చడానికి ఒక పెద్ద స్టవ్ అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అవసరం పడతాయి.
పరాటా తయారీ సెంటర్లో మీకు మంచి డిమాండ్ ఉండి ఆదాయం వస్తున్నట్లయితే, ఒక సహాయకుడిని పెట్టుకుంటే మంచిది డిస్పోజబుల్ ప్లేట్స్ వాడడం ద్వారా మీకు పని తగ్గుతుంది. ఇక పరాటా సెంటర్ ఆదాయం విషయానికి వస్తే సాధారణంగా, ఒక ఆలు పరాటా ధర 25 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఉంటుంది. ఈ లెక్కన మీరు రోజుకు 100 పరాటాలు అమ్మిన కనీసం మూడు వేల వరకు సంపాదించవచ్చు. ఖర్చులు ఒక వెయ్యి రూపాయలు పోయినా మీకు రోజుకు కనీసం 2000 రూపాయల వరకు లాభం లభిస్తుంది. ఈ లెక్కన నెలకు కనీసం 60 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.