Business Ideas: ఉన్న ఊరిలోనే గవర్నమెంటు అందించే 95 శాతం సబ్సిడీతో ఈ బిజినెస్ చేస్తే..17 లక్షలు మీ సొంతం..
గ్రామీణ యువత ఉద్యోగం కోసం ఎదురుచూసే కన్నా కూడా ఉన్న గ్రామంలోనే మంచి బిజినెస్ ఐడియా తో వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా పొందవచ్చు. అలాంటి ఓ వ్యాపారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో ప్రతి ఫంక్షన్లోనూ పువ్వులతో అలంకరణ అన్నది చాలా ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా విదేశీ పువ్వులతో అలంకరణ అనేది డిమాండ్ పెరిగింది. దేశీయంగా లభించే పువ్వులు అయినటువంటి గులాబీ, మల్లె, సంపంగి, కనకాంబరంతో పాటు విదేశీ పూలు అయినటువంటి లిల్లీ, వివిధ రంగుల గులాబీలు, జర్బరా పూలు, టులిప్స్, కాంథెరిస్, డఫడిల్స్ వంటి పువ్వులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పువ్వులతో చేసే అలంకరణ కనుల విందుగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు, విదేశీ పూలతోనే ఎక్కువగా అలంకరణ చేస్తున్నారు.
డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులను విదేశీ పువ్వులను పాలీహౌస్లలో పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తున్నాయి. పాలి హౌస్ నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి స్థాయిలో 95 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. పాలీహౌసుల ద్వారా విదేశీ పువ్వులను ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పెంచవచ్చు. తద్వారా రైతులకు అధిక మొత్తంలో ఆదాయం లభించే అవకాశం ఉంది.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పాలి హౌజుల నిర్మాణం చాలా వేగవంతంగా సాగుతోంది. అంతేకాదు హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ వారి లెక్కల ప్రకారం పాలిహౌజుల ద్వారా 1150 ఎకరాల సాగు విస్తీర్ణంలో పువ్వులు అదేవిధంగా కూరగాయల సాగు కొనసాగుతోంది.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పాలి హౌజుల నిర్మాణం చాలా వేగవంతంగా సాగుతోంది. అంతేకాదు హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ వారి లెక్కల ప్రకారం పాలిహౌజుల ద్వారా 1150 ఎకరాల సాగు విస్తీర్ణంలో పువ్వులు అదేవిధంగా కూరగాయల సాగు కొనసాగుతోంది.
మీరు కూడా పాలీహౌస్ ద్వారా పువ్వుల సాగు చేయాలని అనుకున్నట్లయితే, మీ సొంత భూమిలో పాలి హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. విదేశీ పువ్వులను ప్యాకింగ్ చేయడం కూడా ఒక కళ. మీరు పాలి హౌజుల ద్వారా వ్యవసాయం చేయాలి అనుకున్నట్లయితే, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిపుణుల వద్ద మెళకువలను తెలుసుకోవచ్చు.
అయితే ఈ వ్యవసాయం ద్వారా మీరు పువ్వులను విక్రయించాలి అనుకున్నట్లయితే, నగరానికి దగ్గరలో ఉంటే మంచిది. తద్వారా మీరు సకాలంలో ఆర్డర్లను అందించవచ్చు. విమానాశ్రయం సమీపంలో ఉన్నట్లయితే, మీరు ఇతర నగరాలకు కూడా పువ్వులను ఎగుమతి చేయవచ్చు. విదేశీ పువ్వులకు దాదాపు అన్ని నగరాల్లోనూ చాలా డిమాండ్ ఉంది. సాధారణంగా బెంగళూరు నుంచి పువ్వులను అన్ని నగరాలు దిగుమతి చేసుకుంటాయి. కానీ పాలిహౌజుల నిర్మాణం ద్వారా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వివిధ నగరాలకు పువ్వులు ఎగుమతి అవుతున్నాయి.
పాలీహౌజుల ద్వారా పూల వ్యాపారం చేయడంతో ఒక సంవత్సరానికి 17 లక్షల రూపాయలు సంపాదించవచ్చని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు. అయితే సస్యరక్షణ చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంటుంది. పువ్వుల సాగుకు కావలసిన ఎరువులు, పురుగుల మందులు, ప్యాకేజింగ్ సామాగ్రి విషయంలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన అనంతరమే రైతులు ఈ వ్యాపారం లోకి అడుగుపెడితే మంచిది.