BSNL Recharge Plans : కేవలం 91 రూపాయల రీచార్జ్ తో 90 రోజులు వ్యాలిడిటీ
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్... టెలికాం రంగంలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరిది. బిఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్స్ కు ప్రైవేట్ సంస్థల వినియోగదారులు ఆకర్షితులు అవుతున్నారు. ఇలా బిఎస్ఎన్ఎల్ లో రూ.100 కు తక్కువ రీచార్జ్ ప్లాన్స్ వున్నాయి. అవేంటో చూద్దాం.
BSNL
BSNL : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ... ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు రెక్కలు వచ్చాయి. ఇంతకాలం ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీ పడలేకపోయింది బిఎస్ఎన్ఎల్... కానీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారడంతో జోరు పెచింది. ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ వంటివి రిచార్జ్ ప్లాన్స్ అమాంతం పెంచి ఒక్కసారిగా కస్టమర్లపై భారం మోపాయి. దీంతో చాలామంది సదరు ప్రైవేట్ టెలికాం సంస్థల నుండి బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు.
బిఎస్ఎన్ఎల్ 4G, 5G వంటి టెక్నాలజీ అప్ డేట్ విషయంలో వెనకబడి వుండవచ్చు... కానీ ఎప్పుడూ బడ్జెట్ ప్రెండ్లీ ధరలకే వినియోగదారులకు సేవలు అందించింది. దీంతో ఆ సంస్థపై ప్రజల్లో సాప్ట్ కార్నర్ వుంది. ఇదే ప్రైవేట్ సంస్థలు ఇంత గట్టిగా పోటీనిచ్చినా బిఎస్ఎన్ఎల్ ను నిలబెట్టాయి.
BSNL
ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు ఒకేసారి ఏకంగా 25 శాతంమేర రీచార్జ్ ప్లాన్స్ ధరలు పెంచాయి. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎస్ అతి తక్కువ డబ్బులతో కూడిన రీచార్జ్ ప్లాన్స్ ను కొనసాగిస్తోంది. దీంతో చాలామంది ప్రైవేట్ టెలికాం సంస్థల నుండి బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు. ఇప్పటివరకు ఇలా లక్షలాదిమంది బిఎస్ఎన్ఎల్ లో చేరారు.
BSNL
దాదాపు అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో కనీస రీచార్జ్ రూ.200 కంటే తక్కువలేదు. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం రూ.100 కంటే తక్కువ రీచార్జ్ ప్లాన్స్ ను కొనసాగిస్తోంది. ఇలా చాలా తక్కువ రీచార్జ్ తో ఎక్కువరోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఇలాంటి ప్లాన్స్ లో రూ.91 రీచార్జ్ ఒకటి.
కేవలం 91 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కూడా బిఎస్ఎన్ఎల్ లో వుందంటే నమ్ముతారా..? కానీ నిజంగా ఈ ప్లాన్ ను కొనసాగిస్తోంది. ఇలాంటి ప్లాన్ ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇస్తాయని కూడా ఊహించలేం. కానీ బిఎస్ఎన్ఎల్ అది సాధ్యమయ్యింది.
BSNL
అయితే ఈ రీచార్జ్ ప్లాన్ చాలా పరిమితులు కలిగివుంది. ఇది ఎక్కువరోజులు సిమ్ ను యాక్టివ్ గా వుంచుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాల్స్ చేయాలంటే మాత్రం ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుంది. కాల్ కు 15 పైసలు, ఎస్ఎంఎస్ కు 25 పైసలు, 1 ఎంబి కి 1 పైస చెల్లించాల్సి వుంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టాక్ టైమ్ వోచర్ లేదా డేటా వోచర్ తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.
BSNL
ఈ ఆఫర్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించేవారికి అంతగా ఉపయోగపడదు. కానీ పరిమితంగా ఫోన్ ఉపయోగించేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రూ.91 తో మూడు నెలలపాటు బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అందుకోవచ్చు.
BSNL
ఇలాంటి రీచార్జ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ మరోటి వుంది. సేమ్ రూ.91 తో రీచార్జ్ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడిటీ, 2GB డాటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. ఇలా రూ.100 రూపాయల లోపై బిఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్స్ కొనసాగించడం ప్రైవేట్ టెలికాం సంస్థల వినియోగదారులను ఆశ్చర్యపర్చడమే కాదు ఆకర్షిస్తున్నారు. దీంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.