BSNLలో సూపర్ రీఛార్జ్ ప్లాన్: ఒకేసారి 1095 GB డేటా మీరు ఉపయోగించవచ్చు
వినియోగదారులకు ఆకట్టుకోవడానికి BSNL ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్-ఐడియా కంపెనీలకు పోటీగా టారిఫ్ ప్లాన్స్ ఇస్తోంది. తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ ఇస్తుండటంతో ఇప్పటికే లక్షల మంది ఇతర టెలికాం కంపెనీల కస్టమర్లు BSNLలోకి మారారు. ఇటీవల ఒక సంవత్సరం వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను BSNL ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు ఎన్నో బెనిఫిట్స్ అందిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు టెలికాం సేవలను అందిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ ఇటీవల నెలవారీ, వార్షిక ఛార్జీలను పెంచుతున్నాయి. దీంతో ప్రభుత్వ టెలికాం విభాగం అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సుమాారు 20 లక్షల మంది ఇతర నెట్వర్క్ వినియోగదారులు పోర్టబులిటీ ద్వారా BSNLలోకి వచ్చి చేరినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు 4జి ఇంటర్నెట్ సేవ, 5జి ఇంటర్నెట్ సేవ అని వేగంగా దూసుకుపోతున్నాయి. బిఎస్ఎన్ఎల్ ఇంకా 4జి సేవను దేశ వ్యాప్తం చేసే పనిలో ఉంది. అయినప్పటికీ BSNL కస్టమర్లలో ఆదరణ పెరగడానికి కారణం అది తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుండటమే. టాటా కంపెనీతో కలిసి 4జీ సేవలు వేగంగా అమలు చేస్తుండటం కూడా BSNLకి కలిసి వచ్చే అంశం. అందుకే ఇతర నెట్వర్క్ వినియోగదారులు కూడా బీఎస్ఎన్ఎల్ లోకి మారుతున్నారు.
బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు సూపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఒక సంవత్సరం వ్యాలిడిటీతో కూడిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను బిఎస్ఎన్ఎల్ తీసుకువచ్చింది. రూ.2,999 ధర కలిగిన ఈ ప్లాన్ ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం మొత్తం 1095 GB డేటా మీకు లభిస్తుంది.
ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 3GB డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ సౌకర్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా రోజుకు 100 ఉచిత SMS సదుపాయం కూడా మీరు పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 3GB డేటా అయిపోయినా మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజువారీ డేటా అయిపోయినా 40 Kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా సేవను పొందవచ్చు. ఈ రూ.2,999 ప్లాన్‌లోని ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది తక్కువ ధరకు లభిస్తుంది.
రూ.2,999 మీకు తక్కువ ధరా? అని మీరు అడగవచ్చు. ఇదే విధమైన ఒక సంవత్సరానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు రూ.3,500 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి.
బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ రూ.2,999 ప్లాన్‌లో రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్, ఉచిత SMS కాకుండా వేరే ఎలాంటి ఆఫర్‌ను ప్రకటించలేదు. ఒక సంవత్సరానికి రీఛార్జ్ సేవను ఉపయోగించేవారికి ఇది ఒక వరం లాంటి ప్లాన్. కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసి మీరు ఏడాది పొడవునా ఆనందించవచ్చు.