Recharge plan: కేవలం 5 రూపాయలతో రోజూ 2 జీబీ డేటా... వ్యాలిడిటీ కూడా ఎక్కువే..
టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో సంస్థలు ఆకర్షణీయమైన ప్లాన్స్ తో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పోటీలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. ఈ నేపథ్యంలోనే తాజాగా యూజర్ల కోసం అదిరిపోయే ఓ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది..

బీఎస్ఎన్ఎల్ డేటా ప్లాన్
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి టెలికాం కంపెనీలు టెలికాం రంగంలో ముందంజలో ఉన్నప్పటికీ, మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు మొగ్గు చూపుతున్నారు.
బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ సేవలను అమలు చేయనప్పటికీ, వినియోగదారులలో ఆదరణ పెరగడానికి కారణం తక్కువ ధరకే సేవలను అందిస్తుండటమే. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ చాలా తక్కువ ధరకే డేటాను అందించే ప్లాన్‌ను అమలు చేస్తోంది. ఆ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
బీఎస్ఎన్ఎల్ డేటా ప్లాన్
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 277. ఈ ప్లాన్ ద్వారా మీకు మొత్తం 120 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు. అంటే మీకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 60 రోజులకు ఈ ప్లాన్ ధరను లెక్కిస్తే, మీరు రోజుకు 5 రూపాయల ఖర్చుతో 2 జీబీ డేటాను పొందవచ్చన్నమాట.
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 120 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా పరిమితి ముగిసినా, 40kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ డేటా కావాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్ కానీ ఎస్‌ఎంఎస్ వంటి ఇతర ఆప్షన్స్ ఉండవు. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
బీఎస్ఎన్ఎల్ తక్కువ ధర ప్లాన్లు
అందుకే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే యూజర్లు కచ్చితంగా ఏదైనా యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉండాలి. 277 రూపాయలకు 120 జీబీ డేటా అనేది జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి ఇతర సంస్థలు ఏవి ఇవ్వడం లేదు. జియో విషయానికొస్తే.. 30 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ డేటాకు రూ. 219 వసూలు చేస్తోంది. ఈ లెక్కన బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
బీఎస్ఎన్ఎల్ 4జీ
వినియోగదారుల కోసం తక్కువ ధర ప్లాన్‌లను అమలు చేస్తున్న బీఎస్ఎన్ఎల్, దేశవ్యాప్తంగా 4జీ సేవలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా నగరాలు, గ్రామాల్లో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సిగ్నల్ అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత తొలిసారి బీఎస్‌ఎన్‌ఎల్ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.262 కోట్ల లాభాన్ని ఆర్జించిందని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు. జూన్ త్రైమాసికంలో 8.4 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉండగా, అదే డిసెంబర్ చివరినాటికి ఈ సంఖ్య 9 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు.