MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • BSNL వినియోగదారులకు శుభవార్త.. ఆ రోజు నుంచి 5G సేవలు ప్రారంభం. ఇక అంతా స్పీడ్ బ్రౌజింగే..

BSNL వినియోగదారులకు శుభవార్త.. ఆ రోజు నుంచి 5G సేవలు ప్రారంభం. ఇక అంతా స్పీడ్ బ్రౌజింగే..

BSNL 5G Launch: ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL సంస్థ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పోటీ కంపెనీలను ఢీ కొట్టేందుకు కేవలం రోజుల వ్యవధిలోనే 5G సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆ డేట్, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 25 2025, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పోటీ కంపెనీలన్నీ 5G సేవలంటూ దూసుకుపోతుంటే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రస్తుతం 4G సేవలను అందిస్తోంది. అయితే ప్రైవేటు నెట్వర్క్ కంపెనీలు కూడా కేవలం కొన్ని సిటీస్ లో మాత్రమే 5G సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పోటీనిస్తూ 4G సేవలు పూర్తి చేసిన వెంటనే 5G సేవలు ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ ఆలోచిస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

BSNL ఇప్పుడు 4G నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 75,000 కొత్త 4G టవర్లు పని చేస్తున్నాయి. ఒకటి రెండు నెలల్లో ఇంకో 100,000 4G టవర్లు అందుబాటులోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. దీనివల్ల BSNL 5G సేవను మొదలుపెట్టడానికి దారి ఏర్పడుతుంది.

జూన్‌లో BSNL 5G సేవలు ప్రారంభం

BSNL కోసం ఏర్పాటు చేసిన 100,000 4G టవర్లు 2025 మే నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ప్రకటించారు. ఆ తర్వాత 4G నుంచి 5Gకి మారడం జూన్‌లో మొదలవుతుందన్నారు. టెలికాం శాఖ (DoT) ఈ విషయాన్ని X ద్వారా తెలిపింది. 

34

BSNLను బలోపేతం చేయడానికి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు ఇచ్చింది. ఈ డబ్బుతో BSNL నెట్‌వర్క్‌ను స్ట్రాంగ్ చేస్తున్నారు. 4G, 5G కోసం నెట్‌వర్క్‌ను మెరుగు పరిచి, 3G సేవలను నిలిపి వేస్తున్నారు. ఇప్పుడు BSNL 4G సేవలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో లభిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి జియో పూర్తిగా ఫ్రీ.. వొడాఫోన్ ఇస్తున్న బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా.. 

44

BSNL బడ్జెట్ ప్లాన్

మరిన్ని టవర్లు పెట్టి 4Gని పెంచడానికి బీఎస్ఎన్ఎల్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. నెట్‌వర్క్ బాగుంటే ప్రైవేట్ టెలికాం వినియోగదారులు కూడా BSNLకి మారతారు. గత జూలైలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలామంది BSNLకి మారారు. గత ఏడాది జూలై, సెప్టెంబర్ నెలల్లో లక్షల మంది ఒక్కసారిగా BSNLకి మారారు. 

BSNL రీఛార్జ్ ప్లాన్స్ ప్రైవేట్ కంపెనీల కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఇప్పట్లో రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచనలో BSNL లేదు. 4G నెట్‌వర్క్ తెచ్చి 5G సేవలు తెస్తే BSNLకి ఎక్కువ మంది వస్తారు.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారతీయ టెలికాం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image2
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image3
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved