MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Bonds vs Stocks : స్టాక్స్ vs బాండ్లు.. 2025లో ఏది ఎంచుకోవడం ఉత్తమం?

Bonds vs Stocks : స్టాక్స్ vs బాండ్లు.. 2025లో ఏది ఎంచుకోవడం ఉత్తమం?

Bonds vs Stocks : బాండ్లు, స్టాక్స్ రెండు ఒకేవిధమైన ఆర్థిక ప్రయోజనాలు అందించేవిగా కనిపిస్థాయి. కానీ, 2025 మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేది ఏది? స్టాక్స్-బాండ్లు.. రెండింటిలో దేనిని ఎంచుకోవడం ఉత్తమం? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : May 19 2025, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bonds vs Stocks: వేటిని ఎంచుకోవాలి?
Image Credit : our own

Bonds vs Stocks: వేటిని ఎంచుకోవాలి?

Bonds vs Stocks: 2025 పెట్టుబడి వాతావరణం మార్పుల నడుమ కొత్త ఆర్థిక యుగానికి చేరుకుంటోంది. భారత మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధిని సాధించాయి. ప్రత్యేకంగా కార్పొరేట్ బాండ్ మార్కెట్ $2.69 ట్రిలియన్ స్థాయికి చేరుకోవడం ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు. మారుతున్న రెగ్యులేటరీ విధానాలు, గ్లోబల్ ఇండెక్స్‌లలో భారతదేశ ప్రవేశం, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలతో కూడిన పెట్టుబడుల యాక్సెస్ మారడంతో స్టాక్స్, బాండ్ల మధ్య సరైన ఎంపికపై పెట్టుబడిదారులు మరింతగా ఆలోచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత మార్కెట్‌లో మార్పులు
Image Credit : freepik

భారత మార్కెట్‌లో మార్పులు

ఇటీవలి సంవత్సరాలలో ఫిక్స్‌డ్ ఆదాయం సెగ్మెంట్ బలంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా 2024లో SEBI కార్పొరేట్ బాండ్ల ఫేస్ విలువ రూ. 10 లక్షల నుండి రూ. 10,000కి తగ్గించడం మార్కెట్‌లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది.

గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లలో భారత్

2024లో జేపీ మోర్గాన్ గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారత్ ప్రవేశించగా, 2025 జనవరిలో బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ నుండి నిధుల ప్రవాహం మొదలైంది. సెప్టెంబర్ 2025లో FTSE Russell చేరడం ఎదురుచూస్తోంది.

36
స్టాక్స్ vs బాండ్లు
Image Credit : freepik

స్టాక్స్ vs బాండ్లు

వడ్డీ రేట్ల పరిస్థితి ప్రభావం

ఆర్బీఐ 2025 ప్రారంభంలో రెండు సార్లు 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించింది. జూన్, ఆగస్టులో మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని SBI రీసెర్చ్ అంచనా వేస్తోంది. ఇది బాండ్ మార్కెట్‌కు అనుకూల వాతావరణం.

స్టాక్స్ vs బాండ్లు - ఫండమెంటల్ తేడాలు ఏమిటి?

స్వంతాధికార హక్కు: స్టాక్స్ కంపెనీలో భాగస్వామ్యం ఇస్తే, బాండ్లు అప్పుగా మారుతాయి.

ఆదాయం ఎలా వస్తుంది: బాండ్లు స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని ఇస్తాయి (ఉదాహరణకు, జనవరి 31, 2025 నాటికి 10-ఏళ్ల కార్పొరేట్ బాండ్‌లు సగటు 7.18% లాభాన్నిఅందించాయి), స్టాక్స్ డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్లు (మూలధన లాభాలు) ఇస్తాయి.

రిస్క్ - రిటర్న్: AAA బాండ్లు తక్కువ రిస్క్‌తో 7%-8% లాభాలు ఇస్తే, లోయర్ రేటెడ్ బాండ్లు (క్రెడిట్ రిస్క్ ఎక్కువగా ఉండే బాండ్లు) 13%-14% వరకు లాభాలు ఇస్తాయి. స్టాక్స్ అధిక వాలాటిలిటీతో కూడి ఉన్నప్పటికీ అధిక లాభాల ఛాన్సులు ఉంటాయి.

46
కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి
Image Credit : freepik

కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి

SEBI గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరం లో 12 లక్షల ట్రేడ్స్, రూ. 17 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇది 2015లోని రూ. 7.5 లక్షల కోట్లతో పోలిస్తే భారీ వృద్ధి అని చెప్పాలి.

ఉన్నత రేటింగ్ బాండ్లు: ఉదా: ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (7.95%), తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (9.35%), కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (8.89%).

ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు

5-10 ఏళ్ల గడువుతో 7.25%-8.25% లాభాలు ఇస్తూ, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాయి.

56
స్టాక్స్ vs బాండ్లు : రిస్క్, లిక్విడిటీ, ఆదాయాలు ఎలా ఉంటాయి?
Image Credit : freepik

స్టాక్స్ vs బాండ్లు : రిస్క్, లిక్విడిటీ, ఆదాయాలు ఎలా ఉంటాయి?

  • స్టాక్స్: అధిక వాలాటిలిటీ, కానీ లాంగ్‌టెర్మ్‌ లో అధిక లాభాలు.
  • బాండ్లు: స్థిర ఆదాయం, తక్కువ రిస్క్.
  • లిక్విడిటీ: AAA బాండ్లు గరిష్ఠ లిక్విడిటీ కలిగి ఉంటే, చిన్న కంపెనీ బాండ్లు తక్కువ లిక్విడిటీ కలిగి ఉండొచ్చు.

ఆర్థిక లక్ష్యాల ప్రకారం పెట్టుబడి ఎంపిక

  • షార్ట్‌టెర్మ్ (0-3 సంవత్సరాలు): AAA రేటెడ్ షార్ట్‌టెర్మ్ బాండ్లు ఉత్తమ ఎంపిక.
  • మిడ్‌టెర్మ్ (3-7 సంవత్సరాలు): మిశ్రమ పెట్టుబడుల ద్వారా స్థిర ఆదాయం, గ్రోత్ ఉంటుంది.
  • లాంగ్‌టెర్మ్ (7+ సంవత్సరాలు): స్టాక్స్ అధిక వాటాతో, బాండ్లతో బ్యాలెన్స్ చేయాలి.
66
బాండ్లు vs స్టాక్స్.. ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే?
Image Credit : Freepik@jcomp

బాండ్లు vs స్టాక్స్.. ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే?

బాండ్లు vs స్టాక్స్ విషయాలు మొత్తంగా గమనిస్తే బాండ్లు స్థిర ఆదాయం, క్యాపిటల్ కాపాదన ఇస్తే, స్టాక్స్ దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడతాయి. రెండు తరహా పెట్టుబడులను సమంగా కలిపి, వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడులు పెట్టే విషయంలో ముందుగా మీరు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
india pakistan conflict: పహల్గాం దాడిలో పాకిస్తాన్ కమాండోలు.. బాంబు పేల్చిన పాక్ జర్నలిస్టు
Recommended image2
India vs Bangladesh: బంగ్లాదేశ్ కు షాకిచ్చిన భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved