రూ.25 వేల లోపు బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు ఇవిగో
బెస్ట్ ఫీచర్స్ తో రూ.25 వేల కంటే తక్కువ ధర కలిగిన మంచి మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న ఫోన్లు మీ అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయి. వాటి ఫీచర్ల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం రండి.

ఇయర్ ఎండింగ్ కాబట్టి చాలా కంపెనీలు మంచి ఆఫర్లు ఇచ్చి స్మార్ట్ ఫోన్లు విక్రయిస్తుంటాయి. కొన్ని సెల్ ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ బాగా ఇస్తుంటాయి. మరికొన్నింటిలో కెమెరా పనితీరు బాగుంటుంది. కొన్నేమో ఎక్కువ ఇంటర్నల్ మెమొరీ, చిప్ సెట్, ఓఎస్ వంటి బెస్ట్ ఫీచర్స్ ఇస్తుంటాయి. ఇక్కడ ఉన్న మొబైల్స్ రూ.25 వేల కంటే తక్కువకే మంచి ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మీరూ ఓ సారి పరిశీలించండి.
OnePlus Nord CE4 Lite
వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 2024లో OnePlus నుంచి వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ లో ఒకటి. దీని ధర సుమారు రూ.17,999. ఇది AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. Qualcomm చిప్‌సెట్‌ను ఉపయోగించి ఈ ఫోన్ తయారు చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఈ ఫోన్ పనితీరును మెరుగ్గా చేస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల త్వరగా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. 5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 50 ఎంపీ సోనీ IMX600 సెన్సార్ వంటి అనేక ఫీచర్లు వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ ను ఆకర్షణీయంగా మార్చాయి.
Lava Agni 3 5G
లావా అగ్ని 3 మొబైల్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 22,998. కొన్ని ఈ కామర్స్ వెబ్ సైట్స్ మరింత తక్కువ ధరకు అందిస్తున్నాయి. ఇందులో డ్యూయల్ అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. దీంతో పాటు యాక్షన్ కీ, టెలిఫోటో లెన్స్, కొత్త చిప్‌సెట్, స్ట్రీమ్‌లైన్డ్ సాఫ్ట్‌వేర్ వంటి ఫీచర్స్ మార్కెట్ లో ఈ ఫోన్ కు డిమాండ్ పెంచేలా చేశాయి. డైమెన్సిటీ 7300X చిప్, 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. లావా అగ్ని 3 50MP ప్రైమరీ యూనిట్, 8MP అల్ట్రావైడ్ యూనిట్, 8MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
POCO X6 Pro 5G
పోకో ఎక్స్6 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ తయారీలో డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించారు. 8 GB,12 GB RAM వేరియంట్స్ తో 128 GB, 512 GB ఇంటర్నల్ మెమొరీలను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ గేమింగ్ పర్పస్ కి బాగా ఫేమస్ అయ్యింది. Wild Boost Gaming Optimisation 2.0 సాఫ్ట్‌వేర్ ఉండటం వల్ల గేమ్స్ ఆడేవారు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో 67 వాట్స్ ఛార్జింగ్ ఇచ్చారు. అందువల్ల ఫోన్ ఛార్జింగ్ బాగానే వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా, 64 ఎంపీ OIS లెన్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
Nothing Phone (2a)
నథింగ్ ఫోన్ (2ఎ) 6.7 అంగుళాల 120 Hz, HD10+, 10 bit AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డైమెన్సిటీ 7200 ప్రో చిప్, డ్యూయల్ రియర్ కెమెరా, 50 ఎంపీ ప్రైమరీ లెన్స్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లతో వినియోగదారులకు బెస్ట్ ఫోన్ అయ్యింది. నథింగ్ ఫోన్ (2ఎ) స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 23 నిమిషాల్లో 50 %, 1 గంటలో 100 % ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ ప్రకటించింది. ఇది 128 GB-8 GB RAM, 256 GB-8 GB RAM, 256 GB-12 GB RAM వంటి మూడు వేరియంట్లతో మార్కెట్లో లభ్యమవుతోంది.