Best CNG Cars: సీఎన్‌జీ కారుల్లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి ఇవే!
Best CNG Cars: మీరు బెస్ట్ సీఎన్‌జీ కారు కొనాలని అనుకుంటున్నారా? ఇటీవలే అనేక కంపెనీలు సీఎన్‌జీ వేరియంట్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. వాటిల్లో తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 3 కార్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.

ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉండేది. కాలుష్యం, మెయింటనెన్స్, ధరలు ఇలా అనేక కారణాల వల్ల చాలా మంది సీఎన్ జీ, ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆస్తక్తి చూపుతున్నారు. సీఎన్‌జీ సాంకేతికతతో ఉత్తమ ఫీచర్లు, బలమైన శక్తిని, మంచి మైలేజీని అందించే కారు కోసం మీరు చూస్తుంటే ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడే మొదటి 3 బెస్ట్ సీఎన్‌జీ కార్ల గురించిన సమాచారం ఇదిగో.
ఇది కూడా చదవండి ఇండియాలో రాబోయే 7 సీటర్ ఫ్యామిలీ కార్లు ఇవే!
మారుతి స్విఫ్ట్
మారుతి స్విఫ్ట్ ధర రూ.9.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు 69.75 బిహెచ్‌పి పవర్‌ను, 101.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సిఎన్‌జి సాంకేతికతలో 32.35 కి.మీ. పరిధిని కలిగి ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. ఇవికాకుండా లేటెస్ట్ అప్డేటెడ్ ఫీచర్లు ఇంకా చాలా ఉన్నాయి.
టాటా టైగర్
టాటా మోటార్స్ నుంచి రిలీజ్ అయిన టైగర్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.9.50 లక్షలు. ఇండియాలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఏకైక వాహనం టాటా టైగర్. ఇది 75.5 బిహెచ్‌పి పవర్‌ను, 96.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 5 స్పీడ్ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ కూడా కలిగి ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
మారుతి డిజైర్
ఇటీవల విడుదలైన మారుతి సుజుకి డిజైర్ కూడా తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మారుతి సుజుకి డిజైర్ ధర భారతీయ మార్కెట్లో రూ.9.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఉపయోగించారు. ఇది CNG సాంకేతికతతో 69.75 bhp, 101 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు ఐదు స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ CNG సాంకేతికతతో 33.73 కి.మీ. పరిధిని కలిగి ఉంది. ఈ ఇంజన్ మారుతి స్విఫ్ట్‌లో కూడా ఉపయోగించారు.