Honda Shine: తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ బైక్ కావాలా? మైలేజ్ లోనూ టాప్ ఇదే
Honda Shine: మీరు మార్కెటింగ్ జాబ్ చేస్తుంటారా? లేదా ప్రతి రోజు ఆఫీస్ కి బైక్ పై వెళ్తుంటారా? మీ కోసం చక్కటి సేఫ్టీ ఫీచర్లతో ఉన్న బెస్ట్ బైక్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ బైక్ సేఫ్టీలోనే కాకుండా నడుపుతున్నప్పుడు సౌకర్యంగానూ, స్టైల్ గానూ ఉంటుంది.

హోండా కంపెనీ రిలీజ్ చేసిన బైక్స్ లో ఎక్కువ మందికి ఫేవరేట్ గా నిలిచిన బైక్ షైన్. ఈ బైక్ లుక్ చాలా స్టైల్ గా ఉంటుంది. అంతేకాకుండా నడపడానికి కూడా చాలా కంఫర్ట్‌బుల్ గా ఉంటుంది. అందుకే ఇది చాలా మందికి నచ్చింది. హోండా షైన్ మార్కెట్ లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా ఇప్పటికీ ముందస్తు బుకింగ్ చేసుకుంటేనే గాని కొనిలేనంత డిమాండ్ ఉన్న బైక్ ఇది.
హోండా షైన్ బైక్ ని సిటీలో తిరగడానికి కంపెనీ డిజైన్ చేసింది. అయితే దీని స్టైలిష్ లుక్ వల్ల గ్రామాల్లో కూడా షైన్ కి ఫ్యాన్స్ ఉన్నారు. 125cc కెపాసిటీ ఉండటంతో ఈ బైక్ దూకుడు యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. స్టైలిష్ లుక్, మంచి పనితీరు కావాలనుకొనే వారికి హోండా షైన్ బెస్ట్ ఆప్షన్. ఇది రోజూ ప్రయాణాలు చేసేవారికి బాగా పనికొస్తుంది.
హోండా షైన్ సౌకర్యాల విషయానికొస్తే.. కంఫర్టబుల్ సీటు, అడ్జస్ట్ చేసుకునే హ్యాండిల్ బార్ ఉంది. అందువల్ల అలసట లేకుండా రైడ్ చేయొచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇందులో 125cc, 100cc ఇంజిన్ కెపాసిటీలు కలిగిన మోడల్స్ ఉన్నాయి.
ఈ ఇంజన్లు స్మూత్‌గా పనిచేస్తాయి. హోండా షైన్‌లో సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీనిలో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ఉంది. ఈ బైక్‌లో డబుల్ డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి.
ఈ బైక్ కేవలం 53 సెకన్లలో 60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా వెళ్లొచ్చు.
ఇది 2006లో మొదటిసారిగా ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టింది. 125సీసీ సెగ్మెంట్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటి.
హోండా షైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,000 నుంచి మొదలవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ టూ వీలర్ కోసం చూసేవాళ్లకు ఇది బెస్ట్.