- Home
- Business
- Bajaj Freedom 125 CNG: జస్ట్ రూ.10,000 కట్టి 102 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్ మీ సొంతం చేసుకోండి!
Bajaj Freedom 125 CNG: జస్ట్ రూ.10,000 కట్టి 102 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్ మీ సొంతం చేసుకోండి!
Bajaj Freedom 125 CNG: పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల రోజూ పెట్రోల్ కొట్టించలేక అవస్థలు పడుతున్నారా? వెంటనే సీఎన్‌జీ బైక్ కొనేయండి. దీని కోసం మీరు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కరలేదు. జస్ట్ రూ.10,000 కట్టి బజాజ్ కంపెనీ అందిస్తున్న ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ ని ఇంటికి తీసుకెళ్లండి.

పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో అనేక కంపెనీలు సీఎన్జీ కార్లను తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే సీఎన్జీ బైక్ ల తయారీ గురించి మాత్రం కంపెనీలు ఆలోచించడం లేదు. కాని బజాజ్ కంపెనీ ఆ పని చేసింది. ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్జీ బైక్ తీసుకొచ్చింది. అదే బజాజ్ ఫ్రీడం 125. దీన్ని కొనడం కూడా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. మీరు ఊహించలేనంత సులువుగా కేవలం రూ.10,000 డౌన్ పేమెంట్ కట్టి ఈ సీఎన్జీ బైక్‌ను మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ సూపర్ ఆఫర్ ని వెంటనే సద్వినియోగం చేసుకోండి.
ధర, ఫైనాన్స్ ఆఫర్
మార్కెట్లో బజాజ్ ఫ్రీడం 125 ప్రారంభ ధర దాదాపు రూ.89,000 ఉంది. దీని ఆన్ రోడ్ ధర రూ.1,03,000 వరకు ఉంటుంది. మీరు అంత డబ్బు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫైనాన్స్ చేస్తే రూ.10,000 డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. మిగిలిన డబ్బును 3 సంవత్సరాల్లో ఈజీగా నెలవారీ వాయిదాల్లో కట్టొచ్చు. దీని నెలవారీ వాయిదా దాదాపు రూ.3,000 ఉంటుంది. అంటే తక్కువ బడ్జెట్‌లో సీఎన్జీ బైక్ కొనాలనే మీ కల నిజమవుతుంది.
అదిరిపోయే ఫీచర్లు
ఈ బైక్‌లో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS), డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, పాస్ స్విచ్, క్లాక్ తదితర బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు కంఫర్టబుల్ సింగిల్ సీటు ఇంకా చాలా మంచి ఫీచర్లు ఈ బైక్‌ను మార్కెట్ లో స్పెషల్ గా నిలుపుతున్నాయి. ఇన్ని ఫీచర్లున్న ఈ బైక్ ని నడుపుతుంటే రైడర్లు చాలా కంఫర్ట్ ఫీలవుతారు.
సీఎన్జీ పవర్, మైలేజ్ అదుర్స్
బజాజ్ ఫ్రీడం 125లో 124.58 సీసీ 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 9.7 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్, సింగిల్ సిలిండర్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బైక్ సీఎన్జీలో కిలోకు 102 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీన్ని బట్టి పెట్రోల్ ఖర్చులు ఎంత ఆదా అవుతాయో మీరే ఊహించుకోండి.
సేఫ్టీలోనూ టాప్ క్లాస్
ఈ బైక్‌లో బ్రేకింగ్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంది. ముందు, వెనుక చక్రాలకు ట్యూబ్‌లెస్ టైర్లు, డ్రమ్ బ్రేకులు ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికొస్తే ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది రైడింగ్‌కు కంఫర్ట్‌గా ఉంటుంది.
ఇది కూడా చదవండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో చౌకైన బైక్ ఇదే. ధర తెలిస్తే ఆశ్యర్యపోతారు