రూ.13,000 పే చేస్తే.. 200 కి.మీ. దూరం వెళ్లే స్కూటర్ మీ సొంతం
లాంగ్ డ్రైవ్స్ కు అనుకూలమైన స్కూటర్ ఇది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 200 కి.మీ. వెళుతుంది. లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. కేవలం రూ.13,000 పే చేసి మీరు ఈ స్కూటర్ ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.
దూర ప్రయాణాలకు అనువైనది.. అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? ఏథర్ 450X మీకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తుంది. తక్కువ డౌన్ పేమెంట్‌తో 200 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకొనే వారు కేవలం రూ.13,000 అడ్వాన్స్ పేమెంట్ కడితే స్కూటర్ ను మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైట్లు, ABS వంటి ఫీచర్లతో ఇది వాహనం నడిపే వారికి మరింత సేఫ్టీని ఇస్తుంది.
కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేస్తున్నఏథర్ ఎనర్జీ కంపెనీ తన 450X పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. భారత ఆటో మార్కెట్లో ఏథర్ ఎనర్జీ కి ప్రత్యేక మార్కు ఉంది. తక్కువ ధరకు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వెహికల్స్ తయారు చేసి విక్రయించడంలో ఏథర్ ముందుంటుంది. ఏథర్ నుంచి 450X, 450 అపెక్స్ వంటి మోడల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
Ather 450X బ్యాటరీల సామర్థ్యాన్ని బట్టి రెండు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ 90 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఆల్-LED లైటింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐదు రైడింగ్ మోడ్‌లతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. స్మార్ట్ ఎకోలో ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ వంటి అదనపు ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
Ather 450 అత్యంత ప్రీమియం స్కూటర్. దీని 40 kmph యాక్సిలరేషన్ తీసుకోవడానికి 2.9 సెకన్లు మాత్రమే తీసుకుంటుంది. 7kW గరిష్ట పవర్ అవుట్‌పుట్ కలిగి ఉంది. అపెక్స్ అన్నిLED లైట్లు, పారదర్శక బాడీ ప్యానెల్లు, ఇండియమ్ బ్లూ పెయింట్ అద్భుతమైన లుక్ ఇస్తాయి. ఇది Ola S1 ప్రో, TVS X, సింపుల్ వన్ మోడల్స్ తో పోటీపడుతుంది.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైట్లు, డిస్క్ బ్రేకులు, ఆంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఫీచర్లు ఈ స్కూటర్ ప్రత్యేకత. ఇవి స్కూటర్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్ ని అందిస్తాయి. స్కూటర్ నడిపే రైడర్ల సేఫ్టీయే ముఖ్యంగా ఏథర్ 450X తయారుచేశారు. 5.4 kW మోటార్, 2.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ఈ స్కూటర్ అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. రేంజ్ వరకు వెళుతుంది. దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకు 90 కి.మీ. ఇది ఎటువంటి ప్రయాణాలకైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి ఇది ఎంతో కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. ఏథర్ 450X ఎక్స్ షోరూమ్ ధర రూ.1.15 లక్షలు.
అందరూ కొనుగోలు చేసేలా ఏథర్ ఎనర్జీ ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లు అందిస్తోంది. రూ.13,000 డౌన్ పేమెంట్‌తో హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు. 9.7% వడ్డీ రేటుతో లోన్ కూడా అందిస్తుంది.