- Home
- Business
- Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాయిన్ కొంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు.
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాయిన్ కొంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం అయితే ఈరోజు బంగారం ధర ప్రస్తుతం ఒక్క తులం కొనాలంటే రూ. 62000 దాటిపోయింది. దీంతో అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. సామాన్యులకు బంగారం కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.

సాంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా శుభం జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు దీంతో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తారు.
కొద్ది మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలంటే ఇక బంగారు నాణాలే గతి. అర గ్రాము నుంచి 50 గ్రాముల వరకు బంగారు నాణ్యాలు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం ద్వారా అక్షయ తృతీయ సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చు. అయితే ప్రస్తుతం ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6,200 ఉంది. అర గ్రాము నాణెం కొనుగోలు చేయాలంటే సుమారు 3100 ఖర్చు చేయాలి. అయితే చిన్న మొత్తంలో బంగారు నాణాలు కొనుగోలు చేయాలంటే. నాణ్యత విషయంలో చాలా అనుమానాలు వచ్చే అవకాశం ఉంది.
బంగారం నాణాలను 24 క్యారెట్ల రూపంలో కొనుగోలు చేయాలి. కానీ కొన్ని నగల దుకాణాల వాళ్ళు 22 క్యారెట్లు 18 క్యారెట్ల నాణేలను మీకు అంటగట్టే ప్రమాదం ఉంది అంతేకాదు వాటి ధర చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు 18 క్యారెట్ల నాణెం నీకు అంటగట్టి 24 క్యారెట్ల ధర వసూలు చేస్తారు తద్వారా మీరు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే బంగారు నాణాలను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అయితే నానాణ్యమైన బంగారు నాణాలను ఎక్కడ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఇక ఏమాత్రం సందేహించవద్దు నాణ్యమైన బంగారు నాణేలను బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా MMTC Ltd., Metals and Minerals Trading Corporation of India విక్రయించే బంగారు నాణాలను కొనడం చాలా సురక్షితం అని చెప్పాలి. లేదా టెంపర్ ప్రూఫ్ కలిగినటువంటి ప్యాకింగ్ లో వచ్చే బంగారు నాణేలను కొనుగోలు చేయాలి అలాగే దాని రసీదును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మీరు ఆ నాణాన్ని తిరిగి ఇవ్వడానికి రసీదు దోహదపడుతుంది.
బంగారు నాణేలను ప్రతి సంవత్సరం మీరు కొనుగోలు చేస్తున్నట్లయితే వాటిని జాగ్రత్తగా భద్రపరచుకొని కనీస మొత్తానికి అంటే సుమారు మ 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు చేరగానే మంచి జ్యువెలరీ కింద మార్చుకోవచ్చు. మీ సమీపంలోని స్వర్ణకారులకు మేకింగ్ చార్జీలు చెల్లించి మంచి నగలను తయారు చేయించుకోవచ్చు అయితే 24 క్యారెట్ల బంగారాన్ని నగలుగా మార్చే క్రమంలో దాని శుద్ధతలో ఇతర లోహాలను మిక్స్ చేస్తారు అప్పుడు మీ బంగారు ఆభరణం 22 క్యారెట్ల కు తగ్గిపోతుందని గమనించాలి.