ఓయో ఒక్కటే కాదు.. ఇంకెక్కడి వెళ్లినా ఆధార్ కార్డు అవసరం లేదు. ఫోన్ ఉంటే చాలు
Aadhar card: పన్ని పనులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. రూమ్ బుకింగ్ మొదలు, రైలు టికెట్ బుకింగ్ వరకు ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే ఇకపై కార్డును తీసుకెళ్లాల్సిన పనిలేదు. కొత్త ఇ-ఆధార్ యాప్ అందుబాటులోకి వచ్చింది.

ఇ-ఆధార్ యాప్ ఎందుకు?
ఆధార్ కార్డు భారత పౌరులకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, చిరునామా, వయసు వంటి వివరాలు మారాల్సి వచ్చినా, ప్రజలు ఇంతవరకూ తప్పనిసరిగా సమీపం లోని ‘ఇ-సేవా కేంద్రం’కి వెళ్లాల్సి వచ్చేది. ఈ అసౌకర్యాన్ని తగ్గించేందుకు UIDAI ఇప్పుడు e-Aadhaar Appను విడుదల చేసింది. ఈ యాప్‌తో ఎక్కువ సేవలు నేరుగా మొబైల్‌లోనే పూర్తిచేసుకోవచ్చు.
ఎక్కడ అందుబాటులో ఉంది?
ఇ-ఆధార్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండింటిలోనూ యాప్ ఉచితంగా లభిస్తుంది. ఈ యాప్ ఉంటే ఫిజికల్ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది.
ఈ యాప్‌లో ఉన్న ముఖ్య ఫీచర్లు?
* ఫిజికల్ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఓయో వంటి రూమ్స్‌లో కూడా మీ ఫిజికల్ ఆధార్ కార్డును చూపించాల్సిన పనిలేదు.
* యాప్‌ను ఉపయోగించడానికి బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి.
* అవసరమైతే ఆధార్ డాక్యుమెంట్ ఇవ్వడం బదులు QR కోడ్ షేర్ చేసుకోవచ్చు.
* పేరు, వయసు, చిరునామా వంటి వివరాలను యాప్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
* ఆధార్ సేవలు చాలా వరకూ ఇంటి నుంచి చేయగలగడం వల్ల సమయం ఆదా అవుతుంది.
e-Aadhaar యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా?
* ముందుగా e-Aadhaar యాప్‌ను ఓపెన్ చేయాలి.
* మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.
* తర్వాత మీ ఆధార్ నెంబర్ నమోదు చేయాలి.
* మీ మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.
* తరువాత Face Authentication పూర్తి చేయాలి.
* చివరిగా యాప్ కోసం 6 అంకెల పాస్‌వర్డ్ సెట్ చేయాలి.
* ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఎక్కువ ఆధార్ సేవలను యాప్ నుంచే పొందవచ్చు.
ఏ సేవలకు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.?
ఆధార్‌కు సంబంధించిన సేవలు మొబైల్‌లో పూర్తి అవుతున్నా, కొన్ని సేవల కోసం మాత్రం అనివార్యంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ముఖ్యంగా:
* బయోమెట్రిక్ అప్డేట్
* ఫోటో మార్చడం
* ఈ రెండు సేవలు యాప్‌లో చేయలేరు.