పర్సనల్ లోన్ రిజక్ట్ కావొద్దంటే.. ఈ 6 డాక్యుమెంట్స్ కచ్చితంగా ఉండాల్సిందే
డబ్బులు అవసరం వస్తే వెంటనే చాలా మంది వ్యక్తిగత రుణం కోసం ప్రయత్నిస్తారు. అయితే అప్లికేషన్ ప్రాసెస్ చివరి దాకా వెళ్లాక కూడా రిజెక్ట్ కావడం చూసే ఉంటాం. అయితే పర్సనల్ లోన్ అప్లికేషన్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ 6 డాక్యుమెంట్స్ ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యక్తిగత లోన్
వైద్య ఖర్చులు, వ్యక్తిగత అవసరాలు ఇలా దేనికైనా చాలా మంది మొదట పర్సనల్ లోన్ కోసం ప్రయత్నిస్తారు. మన దేశంలో ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు సైతం పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా తక్కువ వడ్డీతో పాటు ఆకర్షణీయమైన ఈఎమ్ఐ త్వారా తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పించారు.
పర్సనల్ లోన్ ఎలా పొందాలి
ఒకప్పుడు లోన్ కావాలంటే కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో పాటు, మొబైల్ యాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో ఇంట్లో ఉండే లోన్ అప్లికేషన్ ప్రాసెస్ ను ప్రారంభించవచ్చు. వీటిలో మీ పాన్, ఆధార్ వివరాలతో మీకు ఎంత లోన్ వస్తుందన్న వివరాలు పొందొచ్చు. అయితే లోన్ రిజక్ట్ కాకూడదంటే మీ దగ్గర కచ్చితంగా 6 డాక్యుమెంట్స్ ఉండాలి.
పర్సనల్ లోన్ కు ఎలా అప్లై చేయాలి
పర్సనల్ లోన్ పొందాలంటే కచ్చితంగా ఉండాల్సి డాక్యుమెంట్స్ లో పే స్లిప్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అపాయింట్మెంట్ లెటర్, శాలరీ సర్టిఫికేట్ వంటివి ఉండాల్సి ఉంటుంది. మీరు లోన్ తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి బ్యాంకులు మీ మూడు నెలల పే స్లిప్ లను అడుగుతాయి.
పర్సనల్ లోన్ వివరాలు
ఇక పర్సనల్ పొందడానికి కచ్చితంగా ఆధార్ కార్డుతో పాటు, ఉద్యోగ ధృవీకరణ కోసం పత్రాలను బ్యాంకులు అడుగుతాయి. కొన్ని బ్యాంకులు గ్యారెంటీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు లేదా మరే ఇతర ఉద్యోగుల పే స్లిప్స్ కూడా అడుగుతాయి. సాధారణంగా ఉద్యోగం లేని వారిని ఇలాంటి డాక్యుమెంట్స్ అడుగుతుంటాయి.
పర్సనల్ లోన్ క్రెడిట్ స్కోర్
డాక్యుమెంట్ విభాగంలో క్రెడిట్ స్కోర్ రాదు. కానీ పర్సనల్ లోన్ పొందడానికి కచ్చితంగా మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే ఎంత రుణం ఇవ్వాలన్న విషయాన్ని అంచనా వేస్తాయి.