Mahindra: అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు.. ఇవి చాలా స్పెషల్
ప్రస్తుతం కార్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అవసరం కోసం కొందరు, స్టేటస్ కోసం మరికొందరు కార్లను కొంటూనే ఉన్నారు. అయితే కారు కొనేటప్పుడు చాలామంది చూసేది మాత్రం బడ్జెట్. కొత్త మోడల్స్, మంచి ఫీచర్లు, అందుబాటు ధరలో కారు, జీప్ కొనాలనుకుంటే.. ఒకసారి వీటిని చూసేయండి.

ప్రస్తుతం కార్ల వాడకం బాగా పెరిగిపోయింది. మంచి ఫీచర్లు, ధర కాస్త అందుబాటులో ఉంటే చాలు కార్లను కొనేస్తున్నారు. ఇటీవల ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లు, వాటి ప్రత్యేకతలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా థార్
భారతదేశ మార్కెట్ లో మహీంద్రా థార్ కు ప్రత్యేక ప్రజాధరణ ఉంది. ఇది ఆఫ్ రోడ్డులోనూ దూసుకుపోతుంది. ఇది 3 వేరియంట్లను కలిగి ఉంది. ఎక్స్ షోరూంలో వీటి ధరలు రూ.14.5 లక్షల నుంచి రూ. 17.5 లక్షల వరకు ఉన్నాయి. సరికొత్త పెట్రోల్ ఇంజిన్ తో పాటు డీజిల్ పవర్ట్రెయిన్ కూడా ఉంది.
పెట్రోల్ యూనిట్ 150 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 320 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 130 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 300 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా థార్ ఎస్ యూవీలో ముందు భాగంలో 2 ఎయిర్ బ్యాగులు, రోల్ ఓవర్ మిటిగేషన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ బ్రేకింగ్ సిస్టం ఉంది.
మహీంద్రా థార్ రాక్స్
మహీంద్రా థార్ రాక్స్ 5 డోర్స్ తో లాంఛ్ అయింది.పెట్రోల్, డీజిల్ రెండు వర్షన్స్ లో ఇది దొరుకుతుంది. ఈ రెండు ఇంజిన్లు ఆటోమెటిక్ గేర్ సిస్టమ్ ని కలిగి ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. థార్ రాక్స్ 6 వేరియంట్లను కలిగి ఉంది. అందులో MX1, MX3, AX3L, MX5, AX5L, AX7L ఉన్నాయి. వాటి ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.18.99 లక్షల వరకు ఉన్నాయి.
మారుతి సుజుకి జిమ్నీ
మారుతీ సుజుకి జిమ్నీ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన ఆఫ్-రోడ్ వాహనాల్లో ఒకటి. జిమ్నీ 1.5-లీటర్ K15B నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ యూనిట్ 103 hp పవర్, 134.2 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఇది 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో పనిచేస్తుంది. MT ఉన్న వేరియంట్ 16.94 kmpl మైలేజీని అందిస్తుంది, AT ఉన్న వేరియంట్ 16.39 kmpl మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి జిమ్నీ 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్, రియర్ వ్యూ కెమెరా, సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్లను కలిగి ఉంది. జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 12.74 లక్షల నుంచి రూ. 14.95 లక్షల వరకు ఉంటాయి.
ఫోర్స్ గూర్ఖా
ఫోర్స్ గూర్ఖా ఆఫ్-రోడ్ నైపుణ్యాలు సాటిలేనివి. గూర్ఖా 9 అంగుళాల టచ్‌స్క్రీన్, కార్నరింగ్ లైట్లు, కఠినమైన మెటల్ బాడీతో వస్తుంది. ఇది 2 వెర్షన్లలో వస్తుంది: 3-డోర్, 5-డోర్.
138 హార్స్‌పవర్, 320 Nm టార్క్‌తో 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్ రెండు మోడళ్లకు శక్తినిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది. ఎక్స్-షోరూమ్, 3-డోర్ మోడల్ ధర రూ. 16.75 లక్షలు, 5-డోర్ మోడల్ ధర రూ. 18 లక్షలు.

