MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • రూ.200 నోట్లు కూడా నకిలీవి వచ్చేశాయ్. ఇలా చేస్తే ఫేక్ నోటును కనిపెట్టొచ్చు

రూ.200 నోట్లు కూడా నకిలీవి వచ్చేశాయ్. ఇలా చేస్తే ఫేక్ నోటును కనిపెట్టొచ్చు

మీ దగ్గర ఉన్న డబ్బుల్లో రూ.200 నోట్లు ఉన్నాయా? అయితే ఒకసారి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. వాటిల్లో నకిలీ నోట్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణలో ఫేక్ రూ.200 నోట్ల వ్యవహారం వెలుగుచూసింది. నకిలీ రూ.200 నోటును కనిపెట్టడానికి ఓ టెక్నిక్ ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Jan 11 2025, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశంలో నకిలీ నోట్ల చలామణి విపరీతంగా పెరిగిపోయిందనడానికి ఇటీవల వెలుగుచూసిన సంఘటనలే ఉదాహరణ. కొన్ని చోట్ల నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తుంటే తెలంగాణలో మాత్రం కొత్తరకంగా మోసానికి పాల్పడుతున్నారు. ఆ మోసం ఏమిటి? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

మార్కెట్లో నకిలీ నోట్లను అరికట్టడానికి, విదేశాల నుండి నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని పెద్ద నోట్లను రద్దు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2016 నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా 2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే కేంద్రం ఆశించిన ఫలితం రాకపోవడంతో 2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న మొదటిసారి ప్రకటించింది. అప్పటి నుంచి రెండు, మూడు సార్లు గడువు ఇచ్చి ఆ నోట్లను వెనక్కు తీసుకుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని వెనక్కు ఇచ్చేలా ప్రజలకు అవగాహన కూడా కనిపించింది. 

35

కరెన్సీ నోట్లనే కాకుండా కాయిన్స్ ని కూడా వేరే పనులకు అక్రమార్కులు వాడుతున్నారు. చిల్లరను భారీగా సేకరించి బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వాటితో కత్తులు తయారు చేస్తున్నారట. అందుకే ఆర్బీఐ పాత నోట్లు, కాయిన్స్ స్థానంలో కొత్త కరెన్సీని విడుదల చేస్తోంది. 

రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొత్తగా ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలింది. అయితే కొత్త నోట్లకు కూడా నకిలీవి తయారు చేసేస్తున్నారు. ఇప్పటికే రూ.500 నోట్లు నకిలీవి చలామణిలో ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

45

నకిలీ రూ.500 నోట్లను కనిపెట్టే సూచనలు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన రూ.200 నోట్లను కూడా పేక్ చేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ పట్టణంలో నకిలీ రూ.200 నోట్ల ఉదంతం వెలుగుచూసింది. ఈ ఫేక్ నోట్లను మోసగాళ్లు కేవలం వస్తువులు కొనడానకి మాత్రమే ఉపయోగిస్తున్నారట. అందువల్ల ఎక్కడైన రూ.200 నోటు మీకు వచ్చినా, ఇప్పటికే మీ దగ్గర ఉన్నా ఒకసారి మొత్తం చెక్ చేయండి. అది ఫేక్ అని అనుమానమొస్తే తీసుకోకండి. 

55

ఇప్పటికే మీ దగ్గర రూ.200 నోటు ఉన్నా, మార్కెట్లో ఎవరైనా ఇచ్చినా వెంటనే దాన్ని క్లియర్ గా పరిశీలించండి. 

నకిలీ రూ.200 నోటు కాస్త మందంగా ఉంటుంది. సాధారణ రూ.200 నోటులా ఉండదు. ఎందుకంటే రూ.200 నోట్లను కలర్ జిరాక్స్ తీయించి చలామణి చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఫేక్ నోట్లే విడుదల అయ్యాయి. అందువల్ల మీరు తీసుకున్న నోట మందంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Investment: మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌లోగ్యారంటీడ్ ప్లాన్లలో.. ఎంత భాగం పెట్టాలో తెలుసా.?
Recommended image2
Gold Price Crash: అమెరికా-ఇరాన్ మధ్య ట్యాంకర్ వార్....కుప్పకూలిన పసిడి, వెండి..ఎంతంటే?
Recommended image3
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved