- Home
- Automobile
- Bikes
- Budget Bikes: ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. టాప్ 5 బెస్ట్ బడ్జెట్ బైక్స్ ఇవే. మినిమం 70 మైలేజ్
Budget Bikes: ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. టాప్ 5 బెస్ట్ బడ్జెట్ బైక్స్ ఇవే. మినిమం 70 మైలేజ్
Budget Bikes: కొత్తగా బైక్ కొనుగోలు చేసే వారిలో చాలా మంది చూసే అంశం మైలేజ్. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌పై ఆసక్తి చూపిస్తుంటారు. మరి ఇండియాలో అందుబాటులో అలాంటి కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోండా షైన్ 100
స్టైలిష్ లుక్‌తో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ బైక్స్‌లో హోండా షైన్ 100 ఒకటి. ఈ బైక్ ఫీచర్ల విషయానికొస్తే..
* ఇంజిన్: 98.98cc
* పవర్: 7.38 bhp
* టార్క్: 8.05 Nm
* మైలేజ్: 55–60 km/l
* ధర: రూ. 63,191 (ఎక్స్-షోరూమ్)
ఫీచర్స్: CBS, అనాలాగ్ మీటర్, 9-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 168mm గ్రౌండ్ క్లియరెన్స్, 786mm సీట్ హైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హీరో హెచ్‌ఎఫ్ డిలక్స్
తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ బైక్స్‌లో ఇదీ ఒకటి. ఇందులోని ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
* ఇంజిన్: 97.2cc
* పవర్: 7.91 bhp
* టార్క్: 8.05 Nm
* మైలేజ్: సుమారు 70 km/l
* ధర: రూ. 58,020 (ఎక్స్-షోరూమ్)
* ఫీచర్స్: i3S (Idle Stop-Start) టెక్నాలజీ, 165mm గ్రౌండ్ క్లియరెన్స్, కంఫర్టబుల్ సీట్
బజాజ్ ప్లాటినా 100
మంచి మైలేజ్, తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి బజాజ్ ప్లాటినా 100 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ బైక్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..
* ఇంజిన్: 102cc
* పవర్: 7.77 bhp
* టార్క్: 8.3 Nm
* మైలేజ్: సుమారు 70 km/l
* ధర: రూ. 65,407 (ఎక్స్-షోరూమ్)
* ఫీచర్స్: LED DRL, అలాయ్ వీల్స్, 200mm గ్రౌండ్ క్లియరెన్స్, CBS బ్రేకింగ్, 11-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్
టీవీఎస్ రేడియన్
టీవీఎస్ రేడియన్‌ను ప్రీమియం లుక్, మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. ఈ బైక్ ఫీచర్ల విషయానికొస్తే..
* ఇంజిన్: 109.7cc
* పవర్: 8.08 bhp
* టార్క్: 8.7 Nm
* మైలేజ్: సుమారు 68.6 km/l
* ధర: రూ. 66,300 (ఎక్స్-షోరూమ్)
* ఫీచర్స్: రివర్స్ LCD డిస్ప్లే, USB చార్జర్, సైడ్ స్టాండ్, లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ స్పోర్ట్ బైకర్స్ కోసం మరొక మంచి ఎంపికగా చెప్పుకొచ్చారు. ఈ బైక్‌లో..
* ఇంజిన్: 109.7cc
* పవర్: 8.18 bhp
* టార్క్: 8.3 Nm
* మైలేజ్: సుమారు 70 km/l
* ధర: రూ. 58,200 (ఎక్స్-షోరూమ్)
* ఫీచర్స్: USB చార్జింగ్ పోర్ట్, SBT బ్రేకింగ్ సిస్టం, డిజిటల్-అనాలాగ్ క్లస్టర్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.