ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ హాచ్ కారు.. దీపావళికి ఇండియాలోకి ఎంట్రీ .. ఫీచర్స్ అదుర్స్..
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్(mercedes benz) ఇండియా ఈ సంవత్సరానికి సంబంధించిన లాంచ్‌లను ఇంకా పూర్తి చేయలేదు. తాజాగా మెర్సిడెస్ బెంజ్ పోర్ట్‌ఫోలియోలోని హాటెస్ట్ హాచ్ - AMG A45Sని 17 నవంబర్ 2021న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కారు ఖచ్చితంగా దీపావళి(diwali) పండగకి ఒక ఫైర్ క్రాకర్ అని చెప్పవచ్చు.
ఎందుకంటే దీపావళి పండగకి ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుంది. కంపెనీకి ఇప్పటికే థ్రిల్లింగ్ ఏఎంజి లైనప్ ఉంది దీనికి ఇప్పుడు A45Sని జోడిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ AMG A45 S అనేది ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ హాచ్ అండ్ పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU)గా భారతదేశానికి వస్తుంది.
మేము ఈ కారు హాటెస్ట్ అని అంటున్నా చాలా శక్తివంతమైనది అని చెప్పాలనుకుంటున్నాము. మెర్సిడెస్ బెంజ్ AMG A45 S 2-లీటర్, 4 సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది, 416 bhp శక్తిని, 500 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సిరీస్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 2-లీటర్ 4 సిలిండర్ ఇంజిన్.
ఈ కారు 4 చక్రాలకి 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ శక్తిని అందిస్తుంది. A45 Sలో ఆరు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి - కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+, స్లిప్పరీ, ఇండివిజువల్ అండ్ రేస్. కేవలం 3.9 సెకన్లలో 0-100 kmph స్పీడ్ అందుకుంటుంది చెప్పాలంటే నిజంగా చాలా వేగంగా దూసుకెళ్తుంది.
మీకు తెలుసు ఎందుకంటే అందరికంటే ముందు కారును నడిపే అవకాశం మాకు వచ్చింది. ముందువైపు నుంచి చూస్తే ఇంజిన్ స్పోర్టీ క్యారెక్టర్‌తో సరిపోవాలి అందుకె సిగ్నేచర్ AMG పనామెరికానా గ్రిల్ ఇచ్చింది. బానెట్ కూడా మస్కులర్ గా, చక్కగా చెక్కినట్లు ఉంటుంది. ఇంకా పెద్ద ఎయిర్ డ్యామ్‌లు, ఇంటిగ్రేటెడ్ స్ప్లిటర్ లభిస్తుంది. వెనుక వైపు చూస్తే రియర్ డిఫ్యూజర్, క్వాడ్ ఎగ్జాస్ట్ స్పోర్టి లుక్ జోడిస్తుంది. ధర విషయానికొస్తే చౌకగా ఉండకపోవచ్చు కానీ రోడ్డుపైకి వచ్చాక ఈ కారు ధర దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుంది.