Elon Musk:ఇండియాలో టెస్లా కార్ల లాంచ్ పై మౌనం వీడిన ఎలోన్ మస్క్.. ఉత్పత్తి ఏర్పాటుపై క్లారీటి..
యుఎస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లోకి ప్రవేశించడంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కంపెనీ సీఈఓ అండ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్ ఇండియాలో ప్లాంట్ ఏర్పాటులో జాప్యం గురించి మౌనాన్ని వీడారు. భారత్‌లో తయారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి తన సన్నద్ధత ఏంటి, ఎందుకు వెనక్కి తగ్గినట్లు ఎలోన్ మస్క్ చెప్పాడు.
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు, అతని ట్వీట్‌లు నిరంతరం ముఖ్యాంశాలలో ఉంటాయని మీకు తెలుసు. ఇప్పుడు ట్విటర్‌లో ఒక యూజర్ టెస్లా గురించి అడిగినప్పుడు "మేము మా కార్లను విక్రయించడానికి, సర్వీస్ అందించడానికి అనుమతించని ఏ ప్రదేశంలోనైనా టెస్లా తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదు" ఆని ఎలోన్ మస్క్ చెప్పారు.
నితిన్ గడ్కరీ టెస్లా CEOని ఆహ్వానిస్తు, భారతదేశంలో ఈ-వెహికల్ సెక్టార్‌లో ఎక్కువ వృద్ధి ఉందని నేను ఎలాన్ మస్క్‌ని సూచిస్తున్నాను, అతనికి భారతదేశంలో మంచి మార్కెట్ లభిస్తుందని చెప్పారు. చైనాలో అందుబాటులో ఉన్న అన్ని నాణ్యమైన విక్రేతలు, ఆటోమొబైల్ విడిభాగాలు కూడా భారతదేశంలో ఉన్నాయని ఆయన చెప్పారు. దీని ద్వారా ఎలోన్ మస్క్‌కి భారతదేశంలో తయారి, విక్రయించడం సులభం కావచ్చు.
ఎలక్ట్రిక్ కారు టెస్లా ఇండియాలోకి ఎంట్రీ జాప్యం గురించి ఎలోన్ మస్క్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గతంలో బిలియనీర్ వ్యాపారవేత్త భారతదేశంలో దిగుమతి సుంకం సహా ఇతర సమస్యలను ఎదుర్కోవడం గురించి మాట్లాడాడు. జనవరి 16 న చేసిన ట్వీట్‌లో, అతను టెస్లా కారును భారతదేశంలో విడుదల చేయకపోవడానికి గల కారణాన్ని వివరించాడు ఇంకా కంపెనీ ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చాలా సవాళ్లపై పని చేస్తోందని చెప్పాడు. ప్రభుత్వంతో పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని కూడా ట్వీట్ చేశారు.
భారత్‌లో 40 వేల డాలర్ల కంటే ఎక్కువ (సుమారు 28 లక్షల రూపాయలకు పైగా) దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం పన్ను విధిస్తుండగా, దీని కంటే తక్కువ వాహనాలపై 60 శాతం పన్ను విధించడం గమనార్హం. ఈ కోణంలో ఎలోన్ మస్క్ కంపెనీ భారతదేశంలో కార్లను విడుదల చేసినప్పటికీ, వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా వాటి అమ్మకాలు కూడా చాలా తక్కువగా ఉండవచ్చు.