గాలిలో ఎగిరే విమానం కారుల మారితే.. రికార్డు బ్రేక్ చేసిన ఎలక్ట్రిక్ కార్.. నిమిషానికి ఎంత స్పీడంటే ?
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల (electric car)ఆవిష్కరణలు, అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ఒకవైపు రికార్డు(reocrd) స్థాయికి చేరుకుంటున్న ఇంధన ధరలు కూడా దీనికి కారణం. అంతకాకుండా పెరుగుతున్న కాలుష్యన్ని నివారించడానికి కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు, ప్రభుత్వాలు పన్ను రాయితీలను ఇస్తున్నాయి.
ఇప్పటి వరకు భూమి మీద అత్యంత వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ కారు ఏదంటే రిమాక్ నివేర పేరు వినిపిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 412 కి.మీ. ఇప్పుడు ఈ కారు టాప్ స్పీడ్ రికార్డు ని 'లిటిల్ జెయింట్' అనే ఎలక్ట్రిక్ కారు అధిగమించింది. తాజాగా టెస్టింగ్ సమయంలో ఈ కారు స్పీడ్ గంటకు 574.5 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ ప్రాజెక్ట్‌లో కాలిఫోర్నియాలోని ఓషన్‌సైడ్ రివోల్ట్ సిస్టమ్స్‌తో భాగస్వామిని ఎంచుకుంది.
టీమ్ వెస్కో 444 రివోల్ట్ సిస్టమ్స్ స్ట్రీమ్‌లైనర్ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ వాహనం 'లిటిల్ జెయింట్' యునైటెడ్ స్టేట్స్‌లో పూర్తిగా బ్యాటరీతో నడిచే వాహనంగా జాతీయ స్పీడ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. నివేదికల ప్రకారం లిటిల్ జెయింట్ వాహనం 1,152 ప్రిస్మాటిక్ లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది.
అయితే పెట్రోల్ తో నడిచే వాహనంతో పోలిస్తే దీని స్పీడ్ చాలా తక్కువ. భూమి మీద ప్రయాణించే అత్యంత వేగంగా నడిచే కారు పేరు ThrustSSC. దీని టాప్ స్పీడ్ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ ThrustSSC కారు గంటకు 1227.9 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
ఈ కారు స్పీడ్ టెస్ట్ లో ఆక్సీలరేటర్ పూర్తిగా నొక్కినపిడు వేగవంతం అందుకుంటున్నప్పుడు టిమ్ యజమాని రిక్ వెస్కో భవిష్యత్తు గురించి తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.