MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bike Riding Tips: వర్షాకాలంలో బైక్ పై వెళ్లేటప్పుడు ఇవి చెక్ చేస్తున్నారా?

Bike Riding Tips: వర్షాకాలంలో బైక్ పై వెళ్లేటప్పుడు ఇవి చెక్ చేస్తున్నారా?

Bike Riding Tips: వర్షాకాలంలో బైక్, స్కూటర్ నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షంతో తడిసిన రోడ్లు, నీటితో నిండిన గుంతలు, రోడ్లు జారుగా ఉండటం వల్ల ప్రమాదాల ముప్పు ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 22 2026, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వర్షాకాలంలో బైక్ పై వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకండి.
Image Credit : chatgpt

వర్షాకాలంలో బైక్ పై వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకండి.

వర్షాకాలంలో బైక్, స్కూటర్ నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షంతో తడిసిన రోడ్లు, నీటితో నిండిన గుంతలు, రోడ్లు జారుగా ఉండటం వల్ల ప్రమాదాల ముప్పు ఉంటుంది. రోడ్లు బాగా జారుతాయి. అందుకే, టూవీలర్ నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే, వానలో బైక్ లేదా స్కూటర్ మీద వెళ్లే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వర్షాకాలంలో బైక్, స్కూటర్ నడిపేవారు జాగ్రత్త
Image Credit : X

వర్షాకాలంలో బైక్, స్కూటర్ నడిపేవారు జాగ్రత్త

అన్నిటికంటే ముందు, టైర్ల కండిషన్ చెక్ చేసుకోవాలి. అరిగిపోయిన టైర్లు తడి రోడ్లపై పట్టు కోల్పోతాయి. టైర్ ట్రెడ్ సరిగ్గా ఉందో లేదో, గాలి ఒత్తిడి కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అలాగే, బ్రేకులు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ముందే టెస్ట్ చేయాలి. వానలో సడన్‌గా బ్రేకులు వేయకుండా, ముందు, వెనుక బ్రేకులను నెమ్మదిగా వాడటం చాలా సేఫ్.

35
వానలో బైక్ జారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Image Credit : Instagram

వానలో బైక్ జారకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వర్షం పడుతున్నప్పుడు మామూలు కంటే తక్కువ స్పీడ్‌లో వెళ్లడం మంచిది. ముందు వెళ్తున్న బండికి, మీకు మధ్య సరైన దూరం పాటిస్తే.. సడన్‌గా బ్రేకులు వేయాల్సిన అవసరం రాదు, గుంతల్ని కూడా తప్పించుకోవచ్చు. పగటిపూట కూడా హెడ్‌లైట్ ఆన్ చేసి ఉంచితే, మిగతా వాహనదారులు మిమ్మల్ని సులభంగా గమనిస్తారు. హెల్మెట్ వైజర్‌ను శుభ్రంగా ఉంచుకుంటే, వాన చుక్కలు లేదా పొగమంచు వల్ల చూపు మసకబారకుండా ఉంటుంది.
45
వానలో బైక్ రైడింగ్
Image Credit : X

వానలో బైక్ రైడింగ్

రోడ్లపై నీళ్లు నిలిచి ఉన్నచోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నీటిలోపల గుంతలు లేదా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ ఉండొచ్చు. అవసరమైతే, నెమ్మదిగా వెళ్లండి. మధ్యలో బండి ఆపకుండా దాటేందుకు ప్రయత్నించండి. దీనివల్ల ఇంజిన్‌లోకి నీళ్లు వెళ్లే ప్రమాదం కూడా తగ్గుతుంది. వర్షాకాలం మొదలయ్యే ముందే బండికి పూర్తి సర్వీసింగ్ చేయించడం మంచిది. బ్యాటరీ, చైన్, లైట్లు, ఇండికేటర్లు, హారన్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. వానలో తడిచిన తర్వాత బండిని తుడిచి ఆరబెడితే, తుప్పు పట్టకుండా ఉంటుంది.
55
వర్షాకాలంలో బైక్ ప్రయాణం
Image Credit : TVS

వర్షాకాలంలో బైక్ ప్రయాణం

బైక్‌పై వెళ్లేటప్పుడు మంచి క్వాలిటీ ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. దానితో పాటు గ్లోవ్స్, గట్టి షూస్, వర్షం నుంచి కాపాడే రెయిన్ కోట్ వేసుకుంటే మరింత భద్రతగాసురక్షితంగా ఉంటారు. తడి చెప్పులు లేదా స్లిప్పర్లు వేసుకుని బండి నడపడం అస్సలు మంచిది కాదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆటోమొబైల్
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Budget Cars: పండగ సేల్... చాలా తక్కువ ధరకే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్న టాప్ 5 కార్లు
Recommended image2
Car Offers : అక్టోబర్ లో ఈ కారు కొంటే.. ఏకంగా రూ.2.34 లక్షలు సేవ్
Recommended image3
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Related Stories
Recommended image1
Toyota Fortuner 2026: కొత్త ఫార్చ్యూనర్ ఫస్ట్ లుక్.. నెక్స్ట్ జనరేషన్‍లో అదిరే ఫీచర్లు
Recommended image2
Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved