MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోతున్న 4 కొత్త పవర్ ఫుల్ 350సీసీ బైక్స్ ఇవే.. వాటి గురించి తెలుసుకోండి..

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోతున్న 4 కొత్త పవర్ ఫుల్ 350సీసీ బైక్స్ ఇవే.. వాటి గురించి తెలుసుకోండి..

 చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(royal  enfield) పెర్ఫార్మెన్స్ బైక్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 350సీసీ  బైక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. త్వరలోనే మరో నాలుగు శక్తివంతమైన 350సీసీ బైక్స్ విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.  ఓ మీడియా కథనంలో ఈ సమాచారం వెల్లడైంది. కంపెనీ ఇప్పటికే గత 12 నెలల్లో కొత్త క్లాసిక్ 350, మీటోర్ బైక్ ని విడుదల చేసింది.  

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Nov 19 2021, 09:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొత్త జనరేషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (royal enfield bullet 350) (J1B), ఆర్‌ఈ క్లాసిక్ బాబర్ 350 (RE Classic bober) (J1H), RE హంటర్ 350 (RE hunter 350) (J1C1), రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ప్రకారం (royal enfield scram 411) (J1C2) బైక్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా కొన్ని పేర్లను ట్రేడ్ మార్క్ చేసింది. రాబోయే ఈ బైక్‌లకు ఈ పేర్లను ఉపయోగించవచ్చని నివేదికలు ఉన్నాయి. అయితే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్‌ల గురించి తెలుసుకుందాం...

25

 ఆర్‌ఈ బుల్లెట్ 350
కొత్త జనరేషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, దీనిని సరికొత్త క్లాసిక్ 350లో ఉపయోగించారు. దీని డిజైన్ ఇంకా మెకానిజంలో కీలకమైన మార్పులు చేసింది. ఈ మోడల్ కొత్త 350cc ఇంజిన్‌ను పొందుతుంది, 20.2 bhp శక్తిని, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆర్‌ఈ  మీటోర్ 350 లాగే కొత్త ఆర్‌ఈ బుల్లెట్ 350 ట్రిప్పర్ నావిగేషన్‌తో వస్తుంది. 

35

ఆర్‌ఈ హంటర్ 350
నివేదికల చూస్తే ఆర్‌ఈ మీటోర్ పై ఆధారపడిన రోడ్‌స్టర్‌కు ఆర్‌ఈ‌ హంటర్ 350 అని పేరు పెట్టనుంది. దీని డిజైన్ ఎలిమెంట్స్ అండ్ ఫీచర్స్ చాలా వరకు మీటోర్ నుండి తీసుకోబడతాయి. అయితే, దీని బరువు మీటోర్ కంటే తక్కువగా ఉంటుంది. ఇందులో కనిపించే కొన్ని ఫీచర్స్ దానిలో ఉండవు. లైట్ వెట్ బాడీతో బైక్ హై క్రూజింగ్ స్పీడ్ తో మెరుగైన బ్యాలెన్స్‌ని అందిస్తుందని భావిస్తున్నారు. హంటర్ 350 దేశంలోనే అత్యంత బడ్జెట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అవుతుంది.

45

 ఆర్‌ఈ స్క్రామ్ 411
రాబోయే హిమాలయన్ ఆధారిత స్క్రాంబ్లర్ బైక్ కి రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 అనే పేరును ఉపయోగించవచ్చు. ఈ అడ్వెంచర్ బైక్ రోడ్డుపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి హిమాలయన్ కంటే చౌకగా ఉంటుంది. దీనికి సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్‌తో రావచ్చు. 

55

ఆర్‌ఈ క్లాసిక్ 350 బాబర్
రాబోయే ఆర్‌ఈ బాబర్ బైక్ కొత్త క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించబడుతుంది. ఈ బైక్‌కు బాబర్ తరహా పొడవైన హ్యాండిల్‌బార్, సింగిల్ సీట్ యూనిట్, వైట్ వాల్ టైర్లు లభిస్తాయి. దీని డిజైన్ ఇంకా స్టైలింగ్ కాన్సెప్ట్ 2019లో మొదటిసారిగా పరిచయం చేసిన  KX 838 నుండి ప్రేరణ పొంది ఉండవచ్చు. ఈ బైక్‌లో మీటోర్  లాగే 20.2 బిహెచ్‌పి 350 సిసి ఇంజన్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆర్‌ఈ క్లాసిక్ 350 బాబర్ చెన్నై ఆధారిత బైక్ తయారీ ప్లాంట్  నుండి అత్యంత ఖరీదైన ఇంకా నాల్గవ 350cc ఆఫర్ అవుతుంది.రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్‌లకు సంబంధించిన అధికారిక వివరాలు  భవిష్యత్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Honda Activa : ఒక్క నెలలో 262689 అమ్మకాలా..! ఆ స్కూటర్‌ ఏదో తెలుసా?
Recommended image2
Maruti Suzuki : మారుతి సుజుకి బిగ్ ప్లాన్: 2026లో రాబోతున్న 4 అదిరిపోయే కొత్త కార్లు ఇవే!
Recommended image3
India లో కార్ల స్టీరింగ్ కుడి వైపే ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved