రాయల్ ఎన్ఫీల్డ్ వాహనదారులకు అలెర్ట్.. ఆ లోపం కారణంగా 2 లక్షలకు పైగా బైక్స్ రీకాల్..
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా దాని 2 లక్షలకు పైగా బైకులకు రీకాల్ జారీ చేసింది. వీటిలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ వంటి పాపులర్ బైక్‌లతో పాటు ఇటీవల లాంచ్ చేసినా మిటీరియర్ బైక్స్ కూడా ఉన్నాయి.
మొత్తం మీద ఈ రీకాల్ భారతదేశంతో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించిన 2,36,966 యూనిట్ల బైకులను ప్రభావితం చేస్తుంది.
ఈ రీకాల్ డిఫెక్టివ్ ఇగ్నిషన్ కాయిల్ కారణంగా జారీచేయడం జరిగిందని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. బైక్ లో ఈ లోపం కారణంగా మిస్ఫైర్లు, వాహనాల పనితీరు తగ్గడం, కొన్ని అరుదైన సందర్భాల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుందని ఐషర్ మోటార్స్ యాజమాన్యంలోని బైక్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ పత్రికా ప్రకటనలో తెలిపింది.
రాయల్ ఎన్ఫీల్డ్ సాధారణ ఇంటర్నల్ టెస్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ లోపం మొదట కనుగొనబడింది. 2020 డిసెంబర్ నుండి ఏప్రిల్ 2021 మధ్య ఎక్స్ టర్నల్ సప్లయర్ నుండి సేకరించిన పదార్థాన్ని ఉపయోగించి తయారు చేయబడిన నిర్దిష్ట బైక్స్ బ్యాచ్‌లను మాత్రమే ఈ లోపం ప్రభావితం చేస్తుందని చెన్నైకి చెందిన సంస్థ తెలిపింది.
"రీకాల్ యాక్షన్ వేగంగా అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము, కస్టమర్లను సంబంధిత స్థానిక డీలర్‌షిప్‌ల ద్వారా ముందుగానే సంప్రదిస్తాము" అని రాయల్ ఎన్ఫీల్డ్ తన అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ రీకాల్ డిసెంబర్ 2020 నుండి ఏప్రిల్ 2021 మధ్య తయారైన మిటిరియర్ బైక్‌లపై ప్రభావం చూపుతుంది. అలాగే 2021 జనవరి నుండి ఏప్రిల్ మధ్య తయారు చేసి విక్రయించిన క్లాసిక్ అండ్ బుల్లెట్ బైక్స్ కి కూడా ఈ రీకాల్ వర్తిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ రీకాల్ చేసిన బైక్‌లను చెక్ చేసి, అవసరమైతే కంపెనీ డిఫెక్టివ్ భాగాన్ని భర్తీ చేస్తుందని చెప్పారు. బుల్లెట్ తయారీ అంచనా ప్రకారం, 10% బైక్‌లకు మాత్రమే రీప్లేస్మెంట్ సర్వీస్ లభిస్తుంది.
ఈ లోపం కారణంగా ప్రభావితమయ్యే బైక్ కస్టమర్లను ఇప్పటికే సంప్రదిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు పైన తెలిపిన వ్యవధిలో బైక్‌ను కొనుగోలు చేస్తే మీ బైక్ కి రీకాల్ వర్తిస్తుందా లేదా అనేదాని కోసం మీ స్థానిక డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు అని సూచించింది.