MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. కేవలం రూ.99కే ఎలక్ట్రిక్ వాహనాల ట్రైనింగ్..

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. కేవలం రూ.99కే ఎలక్ట్రిక్ వాహనాల ట్రైనింగ్..

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ఆటోమోబైల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కంపెనీలు, ఉత్పత్తి కర్మాగారాల మూసివేత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది, ఈ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. అయితే నిరుద్యోగులకు లేదా ఉద్యోగం చూస్తున్నవారి కోసం ఒక కొత్త ఉపాధి అవకాశం గురించి చెప్పబోతున్నాం...

 

Ashok Kumar | Asianet News | Published : Oct 06 2021, 06:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్న ప్రజలు పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని నొక్కిచెబుతున్నారు. ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కూడా విస్తరిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీదారులు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నారు. దీనితో పాటు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

25
Asianet Image

కేవలం రూ .99కే ఎలక్ట్రిక్ వాహన శిక్షణ కార్యక్రమం 
ముంబైలో వాహన తయారీ సంస్థ రాఫ్ట్ మోటార్స్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో  రాఫ్ట్ మోటార్స్ ఒకటి. అయితే కంపెనీ ఈ 5-రోజుల ఎలక్ట్రిక్ వాహన శిక్షణ కార్యక్రమాన్ని కేవలం రూ .99 ఖర్చుతో నిర్వహిస్తోంది. ఈ శిక్షణలో వారికి మోటార్ రిపేరింగ్, బ్యాటరీ, ఛార్జర్ రిపేరింగ్, ఎలక్ట్రిక్ వాహన భాగాల అసెంబ్లీ, ఛార్జింగ్ స్టేషన్లు మొదలైన వాటి గురించి శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ వాహన శిక్షణ పూర్తయిన తర్వాత, ఎవరైనా  వారి పరిసరాల్లో సర్వీస్ కేంద్రాన్ని ఓపెన్ చేయవచ్చు. దీనితో పాటు, వారు ఈ పరిశ్రమలో ఇతర ప్రత్యామ్నాయ వ్యాపార అవకాశాలను కూడా పొందవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. మీరు టోల్ ఫ్రీ నంబర్ - 1800 210 3888 కి కూడా కాల్ చేయవచ్చు. 
 

35
Asianet Image

ఫోర్డ్ ఉద్యోగులు, డీలర్ల రక్షకునిగా 
ఇటీవల యూ‌ఎస్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో వ్యాపారాన్ని మూసివేయాలని తీసుకున్న నిర్ణయం కారణంగా డీలర్లు, వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఫోర్డ్ ఉద్యోగులు, డీలర్ల రక్షకునిగా రాఫ్ట్ మోటార్స్ ముందుకు వచ్చింది. ఉద్యోగులను నియమించడానికి రాఫ్ట్ మోటార్స్ దరఖాస్తులను కోరుతుంది. ఫోర్డ్ కంపెనీ ఉద్యోగులందరూ రెజ్యూమెలను info@raftmotors.comకి పంపవచ్చు . మార్చి 2022 నాటికి 100 ఫ్యాక్టరీల నుండి నెలకు 50 వేల స్కూటర్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
 

45
Asianet Image

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో రాఫ్ట్ మోటార్స్ కొత్త రికార్డు సృష్టించింది. రాఫ్ట్ మోటార్స్ ఇటీవల ఇండస్ ఎన్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 480 కి.మీ ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొత్త గొప్ప ఫీచర్లతో లాంచ్ చేసారు. ఇండస్ ఎన్‌ఎక్స్ స్కూటర్ రివర్స్ గేర్, తెఫ్ట్ అలారం, కీలెస్-స్టార్ట్, రిమోట్-లాకింగ్, స్టైలిష్ డిస్క్ బ్రేక్‌లు, సురక్షితమైన పార్కింగ్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లను పొందుతుంది. ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేయడానికి, ఈ స్కూటర్ 10amps ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్‌ను కూడా పొందుతుంది. ఇండస్ ఎన్‌ఎక్స్  ఎంట్రీ లెవల్ వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర ముంబైలో రూ .1,8,500. ముంబైలో ఇండస్ ఎన్‌ఎక్స్ టాప్ వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర రూ .2,57,431. 
 

55
Asianet Image

త్వరలో 1600 కి.మీ రేంజ్ కారు
రాఫ్ట్ మోటార్స్ కంపెనీ ఒక ఎలక్ట్రిక్ కారును కూడా అభివృద్ధి చేస్తోంది, దీని ఫుల్ ఛార్జ్‌తో 1600 కి.మీల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారు 2023 సంవత్సరం మధ్యలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో 550కి పైగా నగరాలలో రాఫ్ట్ మోటార్స్ డీలర్‌షిప్‌లు ఉన్నాయి. మార్చి 2022 నాటికి భారతదేశంలోని ప్రతి జిల్లాలోనూ, మార్చి 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలోనూ ఉనికిని కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోంది. ప్రపంచంలోని ప్రతి మూలలో నుండి కంపెనీకి అద్భుతమైన స్పందన లభిస్తోందని రాఫ్ట్ మోటార్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే కాకుండా, రాఫ్ట్ మోటార్స్ వినియోగదారుల ఉత్పత్తులపై కూడా పనిచేస్తోంది. కంపెనీ ఇటీవల ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీలు, హై-ఫై సౌండ్ సిస్టమ్‌ని కూడా విడుదల చేసింది.

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories