ఆనంద్ మహీంద్రా మెచ్చిన దేశి 'డ్రైవర్‌లెస్' బైక్.. టేస్లా సిఈఓ కూడా ఊహించకపోవచ్చు..
బైక్ స్టంట్స్ మనం ఎక్కడో ఒక చోట చూస్తుంటాం.. ఇలాంటివి సోషల్ మీడియా(social media)లో క్షణాల్లో విరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్ర()anand mahindra) తాజాగా ఒక వీడియో వైరల్ అవడంతో షేర్ చేశాడు. అదేంటంటే లెజెండరి కిశోర్ కుమార్ 1972 పరిచయ్ సినిమాలో ముసాఫిర్ హూన్ యారో పాట పాడినప్పుడు అతను ఊహించి ఉండకపోవచ్చు.
అంతేకాదు టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల గురించి మాట్లాడినప్పుడు కూడా భారత మార్కెట్లో ఒక సవాలును ఎదుర్కొంటానని అనుకోకుండొచ్చు. అయితే డ్రైవర్ లేకుండా బైక్ పై ఒక వ్యక్తి ప్రయాణిస్తున్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. డ్రైవర్ లేకుండా అతను రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు భయం లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా "డ్రైవర్ లెస్ వెహికిల్స్" భారతదేశానికి తీసుకురావాలనే ఎలోన్ మస్క్ ఆలోచన ఇండియాలో పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది అంటూ క్యాప్షన్ పెట్టి చెర్ చేశాడు.
ఆ వీడియోను రిషేర్ చేస్తూ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చాలా బాగా నచ్చింది. ముసాఫిర్ హూన్ యారోన్ లిరిక్స్ కి తన స్వంత ట్విస్ట్ కూడా ఇచ్చాడు అంటూ షేర్ చేశాడు.
"నచ్చింది ... ముసాఫిర్ హూన్ యారోన్ ... నా చలక్ హై, నా థికానా (నేను డ్రైవర్ లేని, గమ్యం లేని ప్రాయనికుడిని)" అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో బైక్ ముందుకు వేళుతున్నప్పుడు ఒక వ్యక్తి హాయిగా బైక్ మీద కూర్చున్నట్లు కనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తి ఈ బైక్ స్టంట్ రికార్డ్ చేసిన తర్వాత అతడిని ఇలా అడిగాడు, “ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? ఈ మ్యాజిక్ ఏమిటి? వాహనాన్ని ఎవరు నడుపుతున్నారు, దేవుడా? ” మనిషి అనడంతో దానికి చిన్నగా అతను స్మైల్ ఇచ్చాడు. అతను ఒక చేతిని పైకెత్తి మరి ఇతరులకు సైగ చేసి వారి దృష్టిని ఆకర్షించాడు కూడా.
ఇప్పటివరకు ఈ వీడియోకి 2.31 లక్షల వ్యూస్, 4,500 కి పైగా లైకులు వచ్చాయి. చాలా మంది నిరాశచెందుతూ, ఆశ్చర్యపడుతూ లేదా ప్రశంసలను వ్యక్తం చేస్తూ పోస్ట్‌పై కామెంట్ చేశారు.
"మోస్ట్ టాలెంటెడ్ పర్సన్, సర్," అని ఒక యూజర్ అనగా మరికొందరు అతను హెల్మెట్ లేకుండా ఉన్నారని, ఇలాంటి విన్యాసాలను ప్రోత్సహించవద్దని ఆనంద్ మహీంద్రాను కోరారు. ఇంకొందరు ఇలాంటి బుద్ధిలేని విన్యాసాలు తరచుగా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని, దేశంలో మరణాలకు ఇది ఒక పెద్ద కారణమని అన్నారు.
దీనిని చూసిన తర్వాత ఎలోన్ మస్క్ చాలా ఆశ్చర్యపోతాడని ఒకరు చెప్పారు మహీంద్రా గ్రూప్ ఆటోమేటెడ్ వాహనాలను ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు అన్నారు. అయితే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా కనిపించే వీడియోలు, ఇతర అప్‌డేట్‌లను తరచుగా షేర్ చేస్తుంటారు.