ఇప్పుడు కార్లు కొనేందుకు కొత్త పద్ధతి.. రిటైల్ ఫ్యూచర్ సేల్స్ ప్రోగ్రాం లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్..
జర్మన్ లగ్జరీ ఆటోమోటివ్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్(mercedes benz) అధికారికంగా ఇండియాలో రిటైల్ ఆఫ్ ది ఫ్యూచర్ (ROTF) అనే కొత్త 'డైరెక్ట్ టు కస్టమర్' సేల్స్ మోడల్‌ని ప్రారంభించింది. అయితే ఈ సంవత్సరం జూన్‌లోనే కొత్త సేల్స్ ప్రోగ్రామ్(sales program)కి మారాలని సంస్థ ప్రణాళికను ప్రకటించింది.
ఆటోమేకర్స్ ఫ్రాంచైజ్ భాగస్వాములతో పాటు కంపెనీ , కస్టమర్ మధ్య మరింత పారదర్శకతను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్‌ఓటిఎఫ్ (rotf)కింద మెర్సిడెస్ బ్రాండ్ కార్లను నేరుగా కస్టమర్లకు విక్రయిస్తుంది, అయితే డీలర్‌షిప్‌లు ఈ కార్లను డెలివరీ చేస్తాయి, అలాగే సర్వీసింగ్ ఇంకా ఇతర డెలివరీలపై కూడా భరోసా ఇస్తాయి, వీరిని ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ అని పిలుస్తారు.
ఆర్‌ఓటిఎఫ్ తో మెర్సిడెస్ బెంజ్ కార్లను నేరుగా కస్టమర్లకు విక్రయిస్తుంది, అయితే డీలర్‌షిప్‌లు డెలివరీ, సర్వీసింగ్, ఇతరవి చూసుకుంటాయి
ఆర్‌ఓటిఎఫ్ కింద మెర్సిడెస్ బెంజ్ చేతిలో కార్ల పూర్తి స్టాక్ ఉంటుంది వాటిని ఆన్‌లైన్‌లో లేదా షోరూమ్‌ల ద్వారా నేరుగా కస్టమర్‌కు విక్రయిస్తుంది. వాహన తయారీదారుల డీలర్‌షిప్‌లు అలాగే కొనసాగుతాయి, సర్వీస్ సెంటర్లు కూడా అలాగే ఉంటాయి. ఇప్పటి వరకు కంపెనీ డీలర్‌షిప్‌లు తయారీదారి నుండి పెద్దమొత్తంలో కార్లను కొనుగోలు చేసి తర్వాత వాటిని కస్టమర్‌కు రిటైల్ చేస్తారు. ఈ మార్పుతో మెర్సిడెస్-బెంజ్ ఇండియా కస్టమర్లందరికీ మెరుగైన ధరలను అందిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా డీలర్లపై ఇన్వెంటరీ ధరలు, వేర్ హౌసింగ్ భారాన్ని కూడా తగ్గిస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "ఆర్‌ఓటిఎఫ్ తో మేము ఎన్నో ఇండస్ట్రి -ఫస్ట్ ఇనీషియేటివ్ తో కంప్లీట్ యూనిఫైడ్ కస్టమర్ జర్ని అనుభవాన్ని సృష్టించాము. భారతదేశంలో మొదటిసారిగా ఇన్సిడెంటల్ లేదా ఎక్స్ట్రా చార్జెస్ కస్టమర్‌లకు ఉండవు. కస్టమర్‌లు ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఇండియా నేషనల్ స్టాక్‌కి ఎన్నో రకాలైన ఇన్వెంటరీ ఆప్షన్స్ తో నేరుగా యాక్సెస్ చేయగలరు. ఆర్‌ఓటిఎఫ్ అనేది మా కస్టమర్‌లకు మరింత చేరువ కావడానికి అలాగే అభివృద్ధి చెందుతున్న అవసరాలు, వారి కోరికలను వినడాకి సరైన దిశలో ఒక అడుగు. దేశంలో అత్యంత విశ్వసనీయమైన లగ్జరీ బ్రాండ్‌గా మేము కస్టమర్ సెంట్రిసిటీలో కొత్త స్టాండర్డ్ సెట్ చేసాము.
కస్టమర్ కోసం కొనుగోలు అనుభవం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కస్టమర్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా నుంచి నేరుగా కారును కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇన్‌వాయిస్ డీలర్‌ది కాదు, కంపెనీదే. ఇప్పుడు డీలర్ నుండి అందించే ధరల విషయంలో చర్చలు ఉండవు. ఇప్పుడు వారు భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ మొత్తం కార్‌పార్క్‌ని యాక్సెస్ చేయగలరు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి నచ్చిన డిజైన్ మోడల్, వేరియంట్, కలర్ ఎంచుకోవచ్చు. ఈ కొత్త రిటైల్ ప్రోగ్రామ్‌లో అతుకులు లేకుండా పని చేయడం కోసం మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆర్‌టిఓలతో భారతదేశవ్యాప్తంగా 35 ప్రదేశాలలో, 22 రాష్ట్రాలలో జిఎస్‌టి రిజిస్ట్రేషన్‌తో రిజిస్టర్ చేసింది. మెర్సిడెస్ బెంజ్ స్పెషల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇప్పటికే ఉన్న మెర్సిడెస్ కస్టమర్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌ల కోసం కస్టమైజ్డ్ ఆఫర్‌లను అందిస్తుంది.
అయితే డీలర్‌లకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్టాక్ నుండి కార్ల కలెక్షన్ అందుబాటులో ఉంటుంది. అదనపు సౌలభ్యం కోసం డీలర్ వాహనాన్ని కస్టమర్‌కు డెలివరీ చేయడాన్ని కూడా సులభతరం చేస్తుంది. డీలర్‌షిప్‌లు పెద్దమొత్తంలో స్టాక్‌లను కొనుగోలు చేయనవసరం లేనందున, వాహనాల కొనుగోలు కోసం చాలా డబ్బున బ్లాక్ చేయ్నవసరం లేదు, దీనిని వ్యాపార వృద్ధి పరంగా ఇతర చోట్ల ఉపయోగించవచ్చు.