- Home
- Automobile
- మారుతి ఈ కార్లను లాంచ్ చేయడానికి తొందరపడదు, అమ్మకాలు పెరిగే వరకు వేచి చూస్తుంది: మారుతి చైర్మన్
మారుతి ఈ కార్లను లాంచ్ చేయడానికి తొందరపడదు, అమ్మకాలు పెరిగే వరకు వేచి చూస్తుంది: మారుతి చైర్మన్
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ(maruti suzuki) ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో లాంచ్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని మారుతి చైర్మన్ ఆర్‌సి భార్గవ తెలిపారు. మారుతీ సుజుకి గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ కార్ (electric car)వ్యాగన్ ఆర్‌ని పరీక్షిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉన్నందున 2025 తర్వాత మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియాలో విడుదల చేస్తుందని ఆర్‌సి భార్గవ చెప్పారు.

కేవలం కొన్ని వేల యూనిట్లను మాత్రమే విక్రయిస్తు భారతీయ ఈవి రంగంలోకి ప్రవేశించాలని చూడటం లేదని, అయితే ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించినప్పుడు నెలకు దాదాపు 10వేల యూనిట్లను విక్రయించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
క్యూ3 (Q3)ఆర్థిక ఫలితాలపై వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ పెరుగుతున్న ఇంధన ధరలను ఎదుర్కోవడానికి మారుతి సుజుకి ఇండియా బ్యాటరీ హైబ్రిడ్ లేదా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కంటే మరిన్ని సిఎన్‌జి(CNG) వాహనాలపై దృష్టి సారిస్తోందని తెలిపారు.
"మేము నెలకు 300 లేదా 400 లేదా 500 లేదా 1,000 కార్లను విక్రయించగలిగితే సంతోషించలేము. కానీ ఒకవేళ మేము ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రారంభిస్తే నెలకు 10వేల యూనిట్లను విక్రయించగలిగేలా చూడాలి అని అన్నారు.
మరోవైపు టాటా మోటార్స్ (tata motors)వంటి కంపెనీల టాటా నెక్సాన్, టాటా టిగోర్ ఈవిలతో సహా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందనను వస్తోంది. టాటా విజయంపై మాట్లాడుతూ "నేను సంవత్సరానికి 2 మిలియన్ కార్లను విక్రయిస్తుంటే, అది సాధారణ స్థితికి వచ్చినప్పుడు 2 మిలియన్లలో సంవత్సరానికి 1,00,000 కంటే తక్కువ కార్లను విక్రయించడం సమంజసమా? "
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎప్పుడు లాంచ్ చేయగలదని అడిగినప్పుడు, "నేను మీకు ఒక తేదీని చెప్పవల్సి వస్తే అది 2025 తర్వాత ఉంటుంది" అని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాని ప్రారంభించడం అనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న భార్గవ, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల ధరలు, మౌలిక సదుపాయాలు ఎలా నిర్మించబడుతున్నాయి అంచనా వేయడం కష్టం. అలాగే వాటి ఖరీదు మా చేతుల్లో లేదు అని అన్నారు.
మారుతి కంపెనీ చాలా కాలంగా వ్యాగన్ ఆర్ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాన్ని పరీక్షిస్తోంది, అయితే కారు ప్రారంభ ధర గురించి స్పందించింది. భారతదేశంలో మంచి బ్యాటరీతో రూ. 10 లక్షల లోపు ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడం కష్టమని మారుతి కంపెనీ గతంలో తెలిపింది ఇంకా వ్యాగన్ ఆర్ వంటి చిన్న కారు ఖరీదైన వెర్షన్ నుండి లాంచ్ చేయడంలో అర్థం లేదు.
ఎలక్ట్రిక్ వాహనల కోసం ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్‌లు (PLI) మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనల ప్లాన్‌లను వేగవంతం చేయడానికి ప్రోత్సహిస్తుందా అని అడిగినప్పుడు భార్గవ మాట్లాడుతూ, "PLI పథకం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసే మా ప్రోగ్రాం మారదు. లాంచ్ తేదీ లేదా వాహనం ఎప్పుడు లాంచ్ చేయాలనేది జపాన్‌లోని సుజుకి ప్రాథమికంగా నిర్ణయించుకోవాలి." అని నేను భావిస్తున్నాను.
మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఒ కెనిచి అయుకవా మాట్లాడుతూ సిఎన్‌జి వాహనాల డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ డిమాండ్ ఉన్న వాహనాల ఉత్పత్తిని పెంచుతుందని, రాబోయే కొన్నేళ్లలో మరిన్ని మోడళ్లలో సిఎన్‌జి ఆప్షన్స్ అందించే ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.