Maruti Suzuki Jimny: మహీంద్రా థార్ కు పోటీగా మార్కెట్లోకి వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ, ధర ఎంతో తెలుసా..?
మారుతి సుజుకి జిమ్నీ భారతీయ మార్కెట్లో మోస్ట్ ఎవైటింగ్ కార్లలో ఒకటి. ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించబడుతోంది, అయితే భారతదేశంలో ఇంకా అడుగు పెట్టాల్సి ఉంది. ఇది మారుతి సుజుకి నుండి వచ్చిన అత్యుత్తమ ఆఫ్-రోడ్ వెహికిల్స్ లో ఒకటి అని గమనించాలి, ఇది భారత మార్కెట్లో మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి కార్లకు సవాలు చేయగలదు.
మహీంద్రా థార్ కు పోటీగా, మారుతీ సుజుకి జిమ్నీ మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే ఈ కారు మోడల్ ఫోటోలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఆఫ్‌రోడ్ SUV పూర్తిగా లీక్ అయిన ఫోటోల్లో పూర్తిగా వాల్‌పేపర్‌తో కప్పబడి ఉంది. అయితే ఇది 5 డోర్ల ఎస్‌యూవీ అని స్పష్టమైంది. ఫోటోలు చూస్తుంటే ఈ ఎస్ యూవీ చాలా పొడవుగా ఉంటుందని కూడా స్పష్టమవుతోంది. ఇంటీరియర్స్ దాని ఎక్ట్సీరియర్ లుక్స్ చాలా విలాసవంతంగా ఉన్నాయి. ఇది 2023లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇది భారత మార్కెట్లో మహీంద్రా థార్‌తో నేరుగా పోటీపడనుంది. ఇది థార్ కంటే తక్కువ ఖర్చుతో వస్తోంది. తక్కువ బడ్జెట్ లో కారు కొనే వారికి ఇది మంచి ఎంపికగా మారనుంది. మహీంద్రా థార్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.79 లక్షలుగా నిర్ణయించారు.
మారుతి సుజుకి జిమ్నీని ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేయనున్నారు. ఇది ఆటో ఎక్స్‌పో 2020లో మొదటిసారిగా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి దీని లాంచింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ 5 డోర్ల జిమ్నీలో, స్టెపినీ వెనుక తలుపుపై స్థిరంగా ఉంటుంది. అయితే, స్టెపినీ దాని తుది ఉత్పత్తి మోడల్‌లో ఎక్కడ స్థిరపడుతుందో ఇంకా తెలియలేదు. జిమ్నీ లోపల ఎక్కువ స్థలంతో పాటు, బాలెనో, బ్రెజ్జా తరహాలో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది.
చిప్ కొరత కారణంగా ఉత్పత్తి ఆలస్యమైంది
మారుతి సుజుకి జిమ్నీ ఉత్పత్తి ఫిబ్రవరి 2022లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెమీకండక్టర్ల కొరత కారణంగా ఆలస్యం అయింది. జూన్ 2022 చివరి నాటికి జిమ్నీ ప్రీ-ప్రొడక్షన్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొదటి దశలో, మోడల్ దాదాపు 70% స్థానికంగా లభించే భాగాలతో ఉత్పత్తి చేశారు. మారుతి సుజుకి క్రమంగా దాని లోకల్ గా తయారైన విడిభాగాలతో కార్లను తయారు చేసే స్థాయిని పెంచుతోంది. ప్రారంభ సంవత్సరాల్లో దాదాపు 75,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇండో-జపనీస్ ఆటోమేకర్ డీజిల్ జిమ్నీ ఉత్పత్తికి బోర్డు, అధికారుల ఆమోదం ఇంకా పొందవలసి ఉంది. కొత్త మారుతి జిమ్నీ 7-సీటర్ మహీంద్రా థార్‌తో నేరుగా పోటీపడుతుంది. 5-సీటర్ వేరియంట్ పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ ఆఫ్-రోడ్ కారు 1.5-లీటర్, 4-సిలిండర్ K15B పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది, ఇది 6,000rpm వద్ద 101bhp గరిష్ట శక్తిని, 4,000rpm వద్ద 130Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ న్యూ బ్రెజ్జా, ఎర్టిగా, సియాజ్‌లకు కూడా వస్తోంది. వాహనం 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ఎంపికతో మార్కెట్లోకి వస్తోంది. ఆఫ్-రోడ్ SUV ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. సుజుకి ఆల్‌గ్రిప్ ప్రో 4 వీల్ డ్రైవ్ టెక్నాలజీ, 3-లింక్ రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్, తక్కువ రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్‌తో వస్తుంది. అదే సమయంలో, దీని బేస్ వేరియంట్ ధర 10 లక్షల కంటే తక్కువ ఉంటుంది.
గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి జిమ్నీ క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ రేటింగ్‌లలో 3 మాత్రమే పొందింది. ఆఫ్‌రోడింగ్ కోసం తయారు చేయబడిన ఈ SUV భద్రత పరంగా చాలా బలంగా ఉండాలి. SUVలు పెద్దలకు 73%, పిల్లలకు 84% మాత్రమే సురక్షితం. సేఫ్టీ అసిస్ట్ పరంగా ఇది 50% మాత్రమే సురక్షితం అని తేలింది. ఇది 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో వచ్చే 15-అంగుళాల. 16-అంగుళాల టైర్ల ఎంపికలను పొందుతుంది.